T20 World Cup 2024| టీ20 వరల్డ్ కప్ జూన్ నుండి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో భారత్ విశ్వ విజేతగా నిలవాలని కోరుకుంటుంది. ఇందుకోసం బీసీసీఐ కూడా పక్కా ప్లాన్ ప్రకారం ప్లేయర్స్‌ని సెలక్ట్ చేస్తుంది.ఈ క్రమంలో కేరళ బ్యాటర్ సంజూ శాంసన్‌కి మరోసారి నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూ శాంసన్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తుండగా, ఆ టీం మంచి విజయాలు సాధిస్తూ తొలి స్థానం సంపాదించుకుంది. ఇప్పటి వరకు సంజూ శాంసన్.. 8 మ్యాచ్‌లు ఆడగా, 62.80 యావరేజ్ 152.43 స్ట్రైక్‌రేట్‌తో 314 రన్స్ చేశాడు.
సంజూ శాంసన్ ఇన్నింగ్స్ లో మూడ అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. రానున్న మ్యాచ్‌లలో సంజూ శాంసన్ సెంచరీ కూడా చేస్తాడని అందరు అనుకుంటున్నారు. ఈ ప్రదర్శనతో సంజూ శాంసన్ టీ20 ప్రపంచ కప్ 2024లో పక్కా స్థానం సంపాదించుకుంటాడని అంతా భావించారు. కనీసం రెండో వికెట్ కీపర్‌గా అయినా అతన్ని తీసుకుంటారని అనుకున్నారు. అయితే ఇప్పుడు రిషబ్ పంత్ రూపంలో ఆయని పెద్ద సమస్యే ఎదరుయ్యేలా కనిపిస్తుంది. ఘోర రోడ్డు ప్రమాదంతో 15 నెలల పాటు ఆటకు దూరమైన పంత్.. ఈ సీజన్‌తోనే రీఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు. ఢిల్లీ కెప్టెన్‌గా 9 మ్యాచ్‌లు ఆడిన పంత్ 48.86 సగటు, 161.32 స్ట్రైక్‌రేట్‌తో 342 రన్స్ చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ ప్రదర్శనతో రిషభ్ పంత్ ప్రపంచకప్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకున్నట్టుగా అర్ధమవుతుంది. మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే శక్తి పంత్‌కి ఉంది, అలానే ఎడమ చేతి బ్యాట్స్‌మెన్, ఫినిషర్‌గా కూడా అతనికి మంచి అనుభవం ఉంది. దీంతో సంజూ శాంసన్‌ని ఎంపిక చేసే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని తెలుస్తుంది. ఇక వరల్డ్ కప్ కోసం రెండో వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. కేఎల్ రాహుల్‌కి సంజూ శాంసన్ కన్నా కూడా మిడిల్ ఆర్డర్‌లో ఆడే ఎక్స్‌పీరియెన్స్ ఉంది. ఈ క్రమంలో సంజూ శాంసన్ కి మోండి చేయి చూపించి రిషబ్ లేదంటే కేఎల్ రాహుల్‌లలో ఒకరిని ఎంపిక చేసే ఉంది. అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఓ అంచనాకు వచ్చినట్లు ప్రముఖ వార్త ఏజెన్సీ పేర్కొంది. ది.