T20 World cup finals లో ఇండియా vs సౌత్ ఆఫ్రికా
గయానాలో జరిగిన T20 World cup సెమిఫైనల్స్ లో టీమ్ ఇండియా ఇంగ్లండ్ ను 68 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ లో ఇండియా, సౌత్ ఆఫ్రికా తలపడనున్నాయి.
ఉత్కంఠభరిత మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఒపెనింగ్ బ్యాట్స్ మెన్, కెప్టెన్ రోహిత్ శర్మ 57(39) పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 47(36) పరుగులు చేశాడు.
172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి నిలువలేకపోయింది. 16.4 ఓవర్ లలో 103 పరుగులు మాత్రం చేసి ఆల్ అవుట్ అయింది. అక్షర్ పటేల్, కుల్ దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు తీసుకోగా, జస్ ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీసుకున్నాడు. ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్ళు రన్ అవుట్ అయ్యారు.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా అక్షర్ పటేల్ (3/23) ఎంపికయ్యాడు.