Monday, December 30, 2024
HomeTelanganaTalasani Srinivas Yadav: 9న బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఏర్పాట్లు ప‌రిశీలించిన ఎమ్మెల్యే త‌ల‌సాని

Talasani Srinivas Yadav: 9న బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఏర్పాట్లు ప‌రిశీలించిన ఎమ్మెల్యే త‌ల‌సాని

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 9 వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం జరగనున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన ఆలయ పరిసరాలలో పర్యటించారు.
ఈ సందర్బంగా త‌ల‌సాని శ‌రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా నిర్వహించే అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించేందుకు లక్షలాదిమంది భక్తులు వస్తుంటారని, వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. 2014కు ముందు అమ్మవారి కళ్యాణాన్ని ఆలయం లోపల నిర్వాహించేవారని గుర్తు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయం ముందు, పక్కన రెండు భారీ రేకుల షెడ్డులను నిర్మించి ఆ షెడ్డు కింద అత్యంత ఘనంగా వేలాదిమంది భక్తుల సమక్షంలో అమ్మ‌వారి క‌ళ్యాణం ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామ‌ని తెలిపారు. వివిధ ప్రాంతాలలో ఉన్న వారు కూడా అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించే విధంగా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ( లైవ్ టెలికాస్ట్) చేయడం జరిగిందని తెలిపారు.

అమ్మవారి కళ్యాణానికి ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆలయ పరిసరాలలో ఎలాంటి సీవరేజ్ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. కళ్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఆలయ పరిసరాలలో పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారని, వారి అవసరాలకు సరిపడా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా అమ్మవారి దర్శనం సందర్భంగా భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన భారికేడ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా అవసరమైన ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆలయ పరిసరాలలోని ప్రజలు కూడా అధికారులకు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. అమ్మవారి కళ్యాణం, రధోత్సవం జరిగే రెండు రోజులపాటు భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ ఏసీపీ వెంకటరమణ, ఆర్ అండ్ బీ ఈఈ రవీంద్ర మోహన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, జీహెచ్ఎంసీ డీసీ జగన్, ఈఈ ఇందిర, వాటర్ వర్క్స్ జీఎం హరి శంకర్, ఈవో అంజన కుమారి, ఆలయ చైర్మన్ సాయిబాబా, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అద్యక్షుడు హన్మంతరావు, ఆలయ కమిటీ సభ్యులు అశోక్ యాదవ్, కూతురు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారికి పోచంపల్లి వస్త్రాలు
ఈ నెల 9 వ తేదీన జరగనున్న శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం సందర్బంగా అమ్మవారికి పోచంపల్లి చేనేత పట్టువస్త్రాలను సమర్పించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో మగ్గంపై నేసిన వస్త్రాలను శనివారం పద్మశాలి సంఘం సభ్యులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో ఆలయ ఈవో, చైర్మన్‌లకు అందజేశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు