Tamannah| మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దశాబ్ధం పాటు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన తమన్నా ప్రస్తుతం అంతగా అవకాశాలు అందుకోలేకపోతుంది. అయితే ఇప్పుడు హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపించి సందడి చేస్తుంది. అయితే తమన్నా ఇటీవలి కాలంలో వెండి తెరపై అందంగా కనిపించడంలో ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. మొదట్లో శృంగార సన్నివేశాలు, ముద్దు సీన్లలో నటించకూడదని నిబంధన పెట్టుకున్నా ఆ నిబంధనని గత ఏడాది బ్రేక్ చేసింది. లస్ట్ స్టోరీస్ 2, జీ కార్ద అనే వెబ్ సిరీస్ లలో తమన్నా హాట్ రొమాన్స్ చూసి అందరు ఆశ్చర్యపోయారు.
అయితే తమన్నా అంత బోల్డ్‌గా నటించడంపై కూడా విపరీతమైన ట్రోలింగ్ జరిగింది అప్పుడు తమన్నా స్పందిస్తూ.. నటిగా అన్ని రకాల పాత్రలు ట్రై చేయాలి. అందుకే అలా చేశాను అని వివరణ ఇచ్చింది. అయితే చివరగా తమన్నా బాక్ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తమన్నా, రాశి ఖన్నా కలసి ఈ చిత్రంలో నటించారు. ఇప్పుడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా బోల్డ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్‌గా నిలిచింది. శృంగార సన్నివేశాలు, ముద్దు సీన్లలో నటించేటప్పుడు హీరోయిన్లు ఇబ్బంది పడుతుంటారని చెబుతుంటారు, కాని అది నిజం కాదు.
హీరోయిన్స్ కన్న ఎక్కువ ఇబ్బంది పడేది మగవారే అని చెప్పుకొచ్చింది. తనతో పాటు నటిస్తున్న నటి ఇబ్బంది పడకుండా మనం ఉండాలని మగవాళ్లు అనుకుంటారు. ఆడవాళ్లు ఎలా ఫీలవుతారో, మన గురించి ఏమనుకుంటారో అని టెన్షన్ పడి పోతుంటారు అని తమన్నా పేర్కొంది. అయితే తమన్నా అలా చేయడం వలన సన్నివేశంపై ఎఫెక్ట్ పడుతుంది. నటీనటులు ఇద్దరూ ఒక అండర్ స్టాండింగ్ తో నటిస్తే మాత్రం సన్నివేశం బాగా వస్తుంది అని తమన్నా పేర్కొంది. మొత్తానికి తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.