Friday, April 4, 2025
HomeCinemaTamannah| ప్రియుడితో త‌మ‌న్నా చీక‌టి ఒప్పందం.. పెళ్లి కాకుండానే పిల్ల‌లు ప్లాన్ చేస్తున్నారా..!

Tamannah| ప్రియుడితో త‌మ‌న్నా చీక‌టి ఒప్పందం.. పెళ్లి కాకుండానే పిల్ల‌లు ప్లాన్ చేస్తున్నారా..!

Tamannah| మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో కొన్ని ద‌శాబ్ధాలుగా ఇండ‌స్ట్రీలో రాణిస్తుంది త‌మ‌న్నా.చిన్న వయసులోనే హీరోయిన్‌గా కెరీర్‌ మొదలెట్టిన ఈ భామ ఇప్పుడు ప‌లు భాష‌ల‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా మారింది. త‌మ‌న్నా తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారు పెళ్లి చేసుకోగా, స‌మంత మాత్రం వివాహానికి దూరంగానే ఉంది. కాక‌పోతే గాఢ‌మైన ప్రేమ‌లో మునిగి తేలుతుంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న ఈ అమ్మ‌డు కొద్ది రోజుల క్రితం ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా రివీల్ చేసింది.

మొద‌ట్లో తామిద్ద‌రం స్నేహితుల‌మే అని క‌ల‌రింగ్ ఇచ్చిన త‌మ‌న్నా త‌ర్వాత ఏమ‌నుకుందో ఏమో కాని గ‌త ఏడాది తమ మధ్య ఉన్న ప్రేమ విష‌యాన్ని రివీల్ చేసింది. మేము ప్రేమించుకుంటున్నామ‌ని, త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నామ‌ని తెలియ‌జేసింది. అయితే త‌మ‌న్నా ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉండ‌గా, ఆమె ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. తాను తల్లి కావాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. పెళ్లి కాకుండానే త‌మ‌న్నా తల్లి కావాలని నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్త ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బిడ్డ పుట్టాక వారి బాధ్యతల పట్ల మరింత స్పష్టత వస్తుంది, అలానే బంధం కూడా స్ట్రాంగ్ అవుతుంది. అందుకే విజ‌య్ వ‌ర్మ‌-త‌మ‌న్నా ఆ నిర్ణ‌యం తీసుకున్నార‌ని టాక్.

మ‌రి ఈ వార్త నిజ‌మైతే త‌మ‌న్నా డైరెక్టుగానే బిడ్డకు జన్మనివ్వబోతుందా? లేక సరోగసి పద్దతి ద్వారా తల్లి కావాలనుకుంటుందా అనేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. ఇక త‌మ‌న్నా సినిమాల విష‌యానికి వ‌స్తే ఇటీవ‌ల తెలుగులో F3, గుర్తుందా సీతాకాలం అనే చిత్రాలు చేసి ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. గత ఏడాది చిరంజీవితో ‘భోళా శంకర్’, రజినీకాంత్‌తో ‘జైలర్ సినిమాలు చేయ‌గా, హిందీలో ‘భోలే చుడియాన్’, మలయాళంలో ‘బంద్రా’, తమిళంలో ‘అరన్మనై 4’ వంటి చిత్రాలు చేసి మెప్పించింది. ఇప్పుడు తెలుగులో ‘ఓదెల 2’ మూవీలో భాగం కాగా ఈ సినిమాతో త్వ‌ర‌లోనే ప‌ల‌క‌రించ‌నుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు