AP Exit Polls | సార్వత్రిక ఎన్నికల సమరానికి శనివారం సాయంత్రం 6 గంటలకు తెర పడింది. దీంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వివిధ సర్వే సంస్థలు, వార్తా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఓటర్ల అభిప్రాయాలను సేకరించి, వాటిని క్రోడీకరించి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో అంచనా వేశాయి. మే 13వ తేదీన ఏపీ అసెంబ్లీతో పాటు ఆ రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ కాని విధంగా అత్యధికంగా 82.37 శాతం పోలింగ్ నమోదైంది. భారీ పోలింగ్‌కు తగినట్లుగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఏపీలో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమినే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు అన్ని సర్వే సంస్థలు వెల్లడించాయి.
పీపుల్స్ పల్స్ సర్వే
టీడీపీకి 95 నుంచి 110, వైసీపీకి 45 నుంచి 60, జనసేనకు 14 నుంచి 20, బీజేపీ 2 నుంచి 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ సర్వేలో వెల్లడైంది.
జనగళం సర్వే
టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి 113 నుంచి 122, వైసీపీకి 48 నుంచి 60, ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.
చాణక్య స్ట్రాటజీస్
టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి 114 నుంచి 125, వైసీపీకి 39 నుంచి 49, ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.
పయనీర్ సర్వే..
టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి 144, వైసీపీకి 31 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.