Thursday, April 3, 2025
HomeAndhra PradeshJanasena Party | అలా జరిగితే కూటమికి నష్టం.. ఏపీ హైకోర్టులో ‘గాజు గ్లాస్‌’ గుర్తుపై...

Janasena Party | అలా జరిగితే కూటమికి నష్టం.. ఏపీ హైకోర్టులో ‘గాజు గ్లాస్‌’ గుర్తుపై అత్యవసర పిటిషన్‌..!

Janasena Party | జనసేన పార్టీకి చెందిన ‘గాజు గ్లాస్‌’ గుర్తు విషయంలో తెలుగుదేశం పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. గాజు గ్లాస్‌ను తాము పోటీ చేయని ప్రాంతాల్లో ఎవరికీ కేటాయించొద్దని జనసేన దాఖలు చేయగా.. ఇప్పటికే హైకోర్టు పాక్షిక ఊరటనిచ్చింది. తాజాగా ఈ అంశంపై టీడీపీ మళ్లీ కోర్టుకెక్కింది. జనసేన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు కేటాయిస్తే.. కూటమిలో మిగతా పార్టీల అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.

ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. గాజు గ్లాస్‌ గుర్తు ఫ్రీ సింబల్‌ అని.. ఏపీ వ్యాప్తంగా కేవలం జనసేన పార్టీకి రిజర్వ్‌ చేయలేమని.. ఇప్పటికే సమయం మించిపోయిందని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరిగిపోయిందని.. ప్రస్తుతం ఇతరులకు కేటాయించిన గుర్తులను మార్చలేమని ఈసీ హైకోర్టుకు తెలిపింది. పిటిషనర్ కోరినవిధంగా చేస్తూ వెళితే.. ఎన్నికలు జరిగేంత వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని చెప్పింది. హైకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

RELATED ARTICLES

తాజా వార్తలు