Microsoft | ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున స్థలాన్ని కొనుగోలు చేసింది. రూ.267 కోట్ల వ్యయంతో సుమారు 48 ఎకరాల స్థలాన్ని కొన్నది. రంగారెడ్డి జిల్లా సాయి బాలాజీ డెలవపర్స్ నుంచి ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన డేటా అనలిటికల్స్ సంస్థ ప్రోప్‌స్టాక్ వెల్లడించింది. డేటా సెంటర్ బిజినెస్‌ను మరింత విస్తరించాలని భావిస్తున్న మైక్రోసాప్ట్.. అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకదాన్ని ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని.. అందులో భాగంగానే భూములు కొనుగోలు చేసినట్లు సమాచారం.
టెక్ కంపెనీ కొనుగోలు చేసిన భూమి.. హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉందని.. ఈ డీల్‌తో సంబంధం ఉన్న వ్యక్తి చెప్పారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌కు పుణే, ముంబయి, చెన్నైలో డేటా సెంటర్లు ఉన్నాయి. వాటికి తోడుగా తాజాగా హైదరాబాద్‌లోనూ డేటా సెంటర్ నెలకొల్పబోతున్నట్లు సమాచారం. డేటా సెంటర్ బిజినెస్ కోసం హైదరాబాద్‌లో స్థలాలను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.