Teenmar Mallanna | నల్లగొండ : నల్లగొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. ఈ ఫలితాన్ని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ దాసరి హరిచందన అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి తన ఓటమిని అంగీకరించారు. సాంకేతికంగా ఓడిపోవచ్చు.. కానీ నైతిక విజయం తనదే అని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ పోటీని ఇవ్వలేకపోయారు.
ఈ ఉప ఎన్నికకు మే 27వ తేదీన పోలింగ్ జరిగింది. జూన్ 5వ తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. జూన్ 7వ తేదీ రాత్రి 10.30 గంటలకు ఓట్ల లెక్కింపు ముగిసింది. అనంతరం తుది ఫలితాన్ని వెల్లడించారు. సుమారు 13 వేల ఓట్ల ఆధిక్యంతో తీన్మార్ మల్లన్న గెలిచారు.