“తెలంగాణలో MSME లు బలపడాలి. రాష్ట్రం ఆర్థిక పురోభివృద్ధి సాధించడానికి పరిశ్రమలు రాణించాలి. అందుకు ప్రజా ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. ఒక పాలసీ లేకుండా ఏ రంగం కూడా అభివృద్ధి సాధించలేదు. అందుకే తెలంగాణలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేకంగా #MSME Policy-2024 తీసుకొచ్చాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు.
🔹 MSME లు బలపడితే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అందుకు ప్రజా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఒక ట్రిలియన్ ఎకానమీ సాధించాలన్న లక్ష్య సాధనలో మీరంతా భాగస్వామిగా ఉండాలని MSME లకు పిలుపునిచ్చారు.
🔹 తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్ల నుంచి 2028 నాటికి 7 లక్షల కోట్లకు చేరుతుందని విశ్వసిస్తున్నానని, అందుకు MSME సహాకారం ఉంటుందని ముఖ్యమంత్రి గారు ఆశాభావం వ్యక్తం చెప్పారు.
🔹 ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో పారిశ్రామిక రాయితీలను కొనసాగిస్తామని, పెండింగ్ రాయితీలను కూడా చెల్లిస్తామని ముఖ్యమంత్రి గారు తెలిపారు.
🔹 “ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపించాలన్నదే లక్ష్యం. ఈ ప్రభుత్వం ప్రజా పాలనను అందిస్తుంది. పెట్టుబడులు పెట్టండి. ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఈ విషయంలో అందరి సలహాలు, సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దళితులు, గిరిజనులు, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.” అని చెప్పారు.
🔹 దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి ఆ వర్గాలకు అవసరమైన భూముల కేటాయింపులు, రాయితీలు, సబ్సిడీలు, విద్యుత్ వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు.
🔹 తెలంగాణ సమగ్రాభివృద్ధికి అనేక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ఆ కోవలోనే తెలంగాణలో ఫ్యూచర్ సిటీని డిజైన్ చేశామని చెప్పారు. ఓఆర్ఆర్, దానికి సమాంతరంగా రీజినల్ రింగ్ రోడ్డు, ఈ రెండింటి మధ్య రేడియల్ రోడ్లతో పెట్టుబడుల కోసం సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికలను రచించినట్టు ముఖ్యమంత్రి గారు వివరించారు.
🔹 పెట్టుబడుల కోసం అనేక దేశాలు చైనా ప్లస్ వన్ బాట పట్టాయని, పెట్టుబడులకు ప్రత్యామ్నాయం తెలంగాణ మాత్రమేనని ఈ రాష్ట్రంలో ఉన్న అనుకూల పరిస్థితులను ముఖ్యమంత్రిగారు సమగ్రంగా వివరించారు.