Saturday, December 28, 2024
HomeTelanganaTarget KTR | అరెస్ట్ చేసేదెలా? కెటిఆర్ అరెస్ట్ కు అష్టదారులు

Target KTR | అరెస్ట్ చేసేదెలా? కెటిఆర్ అరెస్ట్ కు అష్టదారులు

Janapadham-08-11-2024 EPaper

అరెస్ట్ చేసేదెలా?
కసి..పగ, ప్రతీకారం
కెటిఆర్ అరెస్ట్ కు అష్టదారులు
మొన్న జన్వాడ ఫాం హౌజ్ లో మిస్
నేడు ఈ ఫార్ములా రేసింగ్ పై తవ్వుతున్న వైనం
మున్సిపల్ శాఖను తోడుతున్నా

ప్రజాపాలనలో పగ ప్రతీకారమే రాజ్యమేలుతున్నది. పాలనపై ఉండాల్సిన దృష్టి గత ప్రభుత్వ పెద్దలను ఎలా ఇరికించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి అడుగులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు విచారణల కమిషన్లు వేసినా ఎందులోనూ పురోగతి లేకపోవడంతో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ప్రభుత్వం తాజాగా ఈ ఫార్మూలా రేసింగ్ ము ప్రధానంగా ఎంచుకుంది. రూ.55కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తూ ఇప్పటికే ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ కు ఏసీబి నోటీసులు జారీ చేసి ఆయన్ను అప్రూవర్ గా మార్చి ఫార్ములా ఈ రేసింగ్ లో కెటిఆర్ సూత్రదారి, పాత్రదారి అనే విధంగా రంగం సిద్దం చేసింది. అంతేకాకుండా ఆయన అరెస్ట్ కు అంతా రెడీ అని సర్కారు లీకులిస్తుండడం గమనార్హం. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో గవర్నర్ ను కలిసి మూసీ ప్రక్షాళన, సమగ్రసర్వే, తన సోదరుడి ఇంట్లో వివాహానికి హాజరుకావాలని కోరి వచ్చారు. పనిలో పనిగా కెటిఆర్ అరెస్ట్ పై గవర్నరప్ తో చర్చించామని తమకు అనుకూలమైన మీడియాకు లీకులిచ్చి పతాకాస్థాయిలో అచ్చువేయించుకుని క్షణిరాంనదం పొందారు. అయితే కెటిఆర్ ను నిజంగా అరెస్ట్ చేయదలుచుకుంటే గవర్నర్ ను కలువడం ఎందుకు, గవర్నర్ అనుమతి ఎందుకో ప్రాధమిక అంశాలను గాలికొదిలిన మీడియా కెటిఆర్ అరెస్టంటూ ప్రచారం చేస్తుండడం రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. గతంలో జగన్ ను గాని, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కవిత ఇతర నేతలను అరెస్ట్ చేసినా ఎవ్వరి అనుమతి తీసుకోలేదు. అయితే అరెస్ట్ మాత్రం చేస్తున్నామని సీఎం, మంత్రుల బృందం ప్రతీ సందర్బంలో చెబుతూ వస్తోంది. కెటిఆర్ ను ఏదో రకాం ఏదో ఒక కేసులో ఇరికేందుకు రకకలా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జన్వాడ ఫాం హౌజ్ విందు కేసులో తన బావమర్ధి పిలుపు మేరకు కెటిఆర్ ఆ ఫాం హౌజ్ పార్టీకి హాజరైతే ఇరికించి కేసులు పెట్టించాలని పోలీసులు పెద్ద స్కెచ్ వేశారని చెబుతున్నారు. ప్రభుత్వం తన పై రా జరుగుతున్న తీరును పసిగట్టే కెటిఆర్ అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇక ఫార్ములా ఈ రేసింగ్ లో ఏదో జరుగబోతోందని పసిగట్టిన కెటిఆర్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోవచ్చని కూడా కుండబద్దలు కొట్టేశారు. ఇదిలా ఉంటే కెటిఆర్ గతంలో పనిచేసిన మంత్రిత్వ శాఖల్లో కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంపై కాళేశ్వరం విచారణ, విద్యుత్ కొనుగోళ్ల విచారణ, ఫోన్ ట్యాపింగ్. గొర్రెల కొనుగోళ్ల విచారణ ముగిసింది. ఇందుల్లో గత ప్రభుత్వ పెద్దల పాత్ర ప్రత్యక్షంగా ఎక్కడా లేదు. కెసిఆర్, కెటిఆర్ లను అరెస్ట్ చేయాలని అడ్డదారులు వెతుకుతున్నా ఫలితం లేకుండా పోతోందని సచివాలయ వర్గాలు కూడా పేర్కొంటుండం కొసమెరుపు.

RELATED ARTICLES

తాజా వార్తలు