Sunday, January 5, 2025
HomeAndhra Pradeshతిరుమ‌ల‌లో తెలంగాణ ప్ర‌భుత్వ వ‌స‌తి గృహం : సీఎం రేవంత్ రెడ్డి

తిరుమ‌ల‌లో తెలంగాణ ప్ర‌భుత్వ వ‌స‌తి గృహం : సీఎం రేవంత్ రెడ్డి

తిరుమ‌ల : తిరుమ‌ల‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కళ్యాణ మండపం, వసతి గృహం ఏర్పాటుకు ఏపీలో త్వ‌ర‌లో ఏర్ప‌డ‌బోయే నూతన ప్రభుత్వ సహకారం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమ‌ల‌లో శ్రీవారిని ద‌ర్శించుకున్న అనంత‌రం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడబోయే నూతన ప్రభుత్వ సహకారంతో, ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధించేలా తన వంతు కృషి చేస్తానన్నారు. తెలంగాణరాష్ట్రంలో వాతావరణం అనుకూలించి, రైతాంగం సస్యశ్యామలం కావాలని కోరారు.

ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారికి ఆలయ అధికారుల స్వాగతం పలికి ద‌ర్శ‌నం చేయించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. శ్రీవారి జ్ఞాపికను అందజేశారు.

రేవంత్ రెడ్డితో పాటు భార్య గీత‌, కుమార్తె నైమిషా, అల్లుడు, మనవడు ఉన్నారు. మనవడి పుట్టు వెంట్రుకల కార్యక్రమం కోసం ఆయన నిన్న సాయంత్రం తిరుమల చేరుకున్నారు. ఉదయం పుట్టు వెంట్రుకల కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోకి వైకుంఠము క్యూలైన్ ద్వారా చేరుకున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు