Sunday, December 29, 2024
HomeTelanganaRvevant Reddy: మాట నిలబెట్టుకున్నం – సీఎం రేవంత్

Rvevant Reddy: మాట నిలబెట్టుకున్నం – సీఎం రేవంత్

మాట నిలబెట్టుకున్నం – సీఎం రేవంత్
నాడు తెలంగాణ – నేడు రుణ మాఫీ

తెలంగాణలో రైతులకిచ్చిన మాటలను నిలబెట్టుకున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

సచివాలయంలో గురువారం రైతు రుణమాఫీ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ సిఏ రేవంత్ బావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికి ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చారని, మంత్రివర్గ సహచరులు, అధికారుల సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని మరోసారి నిరూపణ అయిందని సంతోషం వ్యక్తం చేశారు. నాడు కరీంనగర్ లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని మాటిచ్చారిని, పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసినా మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలిగా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇచ్చారని గుర్తు చేసారు.

అలాగే గత పాలకులు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు సార్లు మాట తప్పారుని, మొదటి ఐదేళ్లలో కేసీఆర్ 16 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి 12 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని
రెండో సారి ప్రభుత్వంలో 12 వేల కోట్లని కేవలం 9 వేల కోట్లు మాత్రమే చెల్లించారని పదేళ్లలో 21 వేల కోట్ల రూపాయలు కూడా రుణమాఫీకి కేసీఆర్ చెల్లించలేదని విమర్శించారు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నా కేసీఆర్ ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చలేదని ఆరోపించలేదు. మే 6, 2022 న వరంగల్ లో లక్షలాది మంది రైతుల సమక్షంలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారని, సెప్టెంబర్ 17, 20023లో తుక్కుగూడాలో సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ లను ప్రకటించారని, రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆనాడు సోనియా గాంధీ మాట ఇచ్చారన్నారు. సచివాలయంలో కూర్చొని ధైర్యంగా తెలంగాణ రైతులకు 6,098 కోట్ల రూపాయలను రుణమాఫీ ఖాతాల్లో జమ చేస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్ కటాఫ్ పెట్టిన తేదీ మరునాటి నుంచే రుణమాఫీ అమలు చేస్తున్నమన్నారు. లక్ష లోపు రుణం ఉన్న రైతులకు ఈ రోజు రుణ విముక్తి కల్పించామని, లక్ష నుంచి లక్షన్నర రుణం ఉన్న రైతులకు త్వరలోనే రుణ విముక్తి కలుగుతుందని, ఆగస్టు నెల పూర్తి కాకముందే రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని వివరించారు. కొంత మంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ఉండాలనే అపోహ సృష్టిస్తున్నారని రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదుని మరో సారి స్పష్టం చేశారు.

తన ప్రభుత్వం ఒకటో తారీఖున జీతాలిస్తుందని,
సంక్షేమ కార్యక్రమాలకు ఏడు నెలల్లో 29 వేల కోట్లు ఖర్చు చేశామని,
గత ప్రభుత్వం అప్పులకు మిత్తి గా ప్రతి నెలా ఏడు వేల కోట్లు చెల్లిస్తున్నాం అన్నారు. రైతు రుణమాఫీ దేశానికి తెలంగాణ మోడల్ ఆదర్శంగా ఉండబోతుందన్నారు,.

హరీష్ రాజీనామా ను అడుగం

ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణ మాఫీ జరిగితే తన రాజీనామాను స్పీకర్ పార్మాట్ లో సమర్పిస్తానని చెప్పిన మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికైనా గుర్తు పెట్టుకోవాలని సీఎం రేవంత్ చురకలంటించారు. కాంగ్రెస్ సర్కారు మాటిస్తే తప్పదని గుర్తు చేస్తూ హరీశ్ రాజీనామాను నేను అడుగను అని అన్నారు. రైతు రుణమాఫీ సందర్భంగా రాహుల్ గాంధీ ని ఆహ్వానించి వరంగల్ లో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.

వరంగల్ లో కృతజ్ఞత సభ

రైతు డిక్లరేషన్ చేసిన వరంగల్ జిల్లా కేంద్రంలో రైతు రుణ మాఫీ సందర్భంగా రైతు కృతజ్ఞత సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని దృవీకరించారు. త్వరలో మంత్రులంతా ఢిల్లీకెల్లి సోనియా సహా కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.

RELATED ARTICLES

తాజా వార్తలు