Telangana | ఆస్ట్రేలియాలో తెలంగాణ యువకుడు అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా మారాడు. ఐదురోజుల కిందట కనిపించకుండా పోగా.. చివరకు సముద్రంలో శవమై కనిపించాడు. మృతుడు షాద్‌నగర్‌కు చెందిన దివంగత బీజేపీ నాయకుడు అరటి కృష్ణ, ఉషారాణి దంపతులు కొడుకు అరవింద్ యాదవ్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లో సెటిల్ అయ్యాడు. ఏడాదిన్నర కిందట కేశంపేట మండలం చింతకొండపల్లికి చెందిన సిరివెన్నెలతో అతనికి వివాహమైంది. ఇక కుమారుడి వద్దకు రెండు నెలలకిత్రం తల్లి ఉషారాణి వెళ్లింది. గత సోమవారం తిరిగి షాద్‌నగర్‌కు వచ్చింది.
అదే రోజు అరవింద్ కనిపించకుండాపోయాడు. అరవింద్ ఆచూకీ కనిపించకపోవడంతో భార్య సిరివెన్నెల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే అరవింద్ మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం సిడ్నీ బీచ్‌లో గుర్తించారు. ఇది ప్రమాదమా? ఆత్మహత్యా? ఎవరైనా హత్య చేశారా? అన్నది తెలియరాలేదు. కంటికిరెప్పలా పెంచిన కొడుకు కన్నుమూయడంతో ఉషారాణి కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు స్థానిక బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి సహకారంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.
అయితే, అరవింద్ దంపతులు తమ స్వస్థలమైన షాద్‌నగర్‌కు వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారని.. ఇందుకోసం విమానం టికెట్లు సైతం బుక్ చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 20న అరవింద్ తన కారు వాష్ కోసం బయటకు తీసుకెళ్తున్నానని గర్భిణి అయిన తన భార్యకు చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి రాలేదు. దాంతో ఆమె న్యూ సౌత్ వేల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీచ్‌లో మొదట కారును గుర్తించారు. ఆ తర్వాత మృతదేహాన్ని కనుగొన్నారు. డీఎన్‌ఏ టెస్టులో అరవింద్ అని నిర్ధారించారు. అరవింద్ మృతదేహం లభ్యమైనట్లు ఆస్ట్రేలియా అధికారులు తమకు సమాచారం అందించారని అరవింద్ మేనమామలు యాదయ్య, బాలకృష్ణ తెలిపారు.