Wednesday, January 1, 2025
HomeBusinessTelecom Subscribers | దేశంలో 120 కోట్లకు చేరిన టెలికం సబ్‌స్క్రైబర్లు

Telecom Subscribers | దేశంలో 120 కోట్లకు చేరిన టెలికం సబ్‌స్క్రైబర్లు

న్యూఢిల్లీ: దేశంలో టెలికం సబ్‌స్ర్కైబర్ల (Telecom Subscribers) సంఖ్య మరింత పెరిగింది. మార్చి నెల చివరినాటికి సబ్‌స్ట్రైబర్లు 119.9 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్‌ (Trai) వెల్లడించింది. ఇది గత నెలతో పోలిస్తే స్వల్పంగా అధికమని పేర్కొంది. టెలికం దిగ్గజాలైన రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు నూతన కస్టమర్లు చేరుకున్నట్లు తెలిపింది.

జియోకు కొత్తగా 21.4 లక్షల మంది చేరగా, ఎయిర్‌టెల్‌కు 17.5 లక్షల మంది జతయ్యారు. కానీ, వొడాఫోన్‌ ఐడియా 6.8 లక్షల మందిని కోల్పోగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ 23.5 లక్షలు, ఎంటీఎన్‌ఎల్‌ 4,674 మంది వెళ్లిపోయారు. అలాగే బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్ర్కైబర్లు 92.4 కోట్లకు చేరుకున్నట్లు ట్రాయ్‌ తన నెలవారి నివేదికలో తెలిపింది. వైర్‌లెస్‌ బ్రాండ్‌బ్యాండ్‌ వినియోగించేవారి సంఖ్య 88.32 కోట్లకు పెరిగిందని వెల్లడించింది.

 

RELATED ARTICLES

తాజా వార్తలు