Monday, December 30, 2024
HomeNationalTerrorist Attack | పూంచ్‌లో ఎయిర్‌ఫోర్స్‌ వాహనాలపై ఉగ్రవాదుల కాల్పులు.. గాయపడ్డ నలుగురు సైనికులు

Terrorist Attack | పూంచ్‌లో ఎయిర్‌ఫోర్స్‌ వాహనాలపై ఉగ్రవాదుల కాల్పులు.. గాయపడ్డ నలుగురు సైనికులు

Terrorist Attack | లోక్‌సభ ఎన్నికల వేళ జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పూంచ్‌ జిల్లా సూరన్‌కోట ప్రాంతంలో సైనిక సిబ్బంది వాహన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో నలుగురు ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందికి గాయాలయ్యాయి. గతేడాది సైన్యంపై వరుసగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది సైన్యంపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని సైన్యం వర్గాలు పేర్కొంటున్నారు. అయితే, దాడిలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం.

దాడి ఘటన అనంతరం సైన్యం భారీగా బలగాలను మోహరించింది. గాయపడ్డ సైనికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌ పూంచ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని స్థానిక రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. షాసితార్ సమీపంలోని ఎయిర్ బేస్ లోపల వాహనాలకు భద్రత కల్పించినట్లు తెలిపారు. సైనిక సిబ్బందికి గాయాలైనట్లుగా భద్రతా దళాలు వెల్లడించాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు