Friday, January 3, 2025
HomeTelanganaటీజీ టెట్ 2024 ఫ‌లితాలు విడుద‌ల‌.. పేప‌ర్‌-2లో కేవ‌లం 34.18 శాతం ఉత్తీర్ణ‌త‌

టీజీ టెట్ 2024 ఫ‌లితాలు విడుద‌ల‌.. పేప‌ర్‌-2లో కేవ‌లం 34.18 శాతం ఉత్తీర్ణ‌త‌

హైద‌రాబాద్ : టీజీ టెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేశారు. టీజీ టెట్‌కు 2,86,381 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 మంది అభ్యర్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 మంది అభ్యర్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. పేపర్-1లో 67.13 శాతం, పేపర్-2లో 34.18 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24 శాతం, పేపర్-2లో 18.88 శాతం ఉత్తీర్ణ‌త పెరిగింది.

టెట్ దరఖాస్తుల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా టెట్ దరఖాస్తు ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని ఎన్నిక‌ల క‌మిష‌న్ అంగీక‌రించ‌లేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించిన ప్రభుత్వం. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం క‌ల్పించింది ప్ర‌భుత్వం.

RELATED ARTICLES

తాజా వార్తలు