తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలం(Arunachalam)లో గురుపౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు రీజినల్ మేనేజర్ శ్రీలత తెలిపారు.
హైదనాబాద్: తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలం(Arunachalam)లో గురుపౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు రీజినల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. ఈనెల 19వ తేదీన ఆర్టీసీ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్ ప్రాంతాల నుంచి సూపర్ లగ్జరీ బస్సులు నడవనున్నాయి. ఎంజీబీఎస్ నుంచి ఒకరికి రూ.3,700లు చార్జీ వసూలు చేయనున్నారు. బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్ నుంచి రూ.3,900లు చార్జీ వసూలు చేయనున్నారు. 19న బయలుదేరే బస్సు 20న ఉదయం 8గంటలకు కాణిపాకం(Kanipakam), గోల్డెన్ టెంపుల్ దర్శనానంతరం బయలుదేరి రాత్రి 8గంటలకు అరుణాచలం చేరుకుంటుంది.