హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాల మేరకు టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ ఆర్టీసీగా ఆ సంస్థ మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతమున్న లోగో కాకుండా గతంలో ఉన్న లోగోకు టీజీఎస్ ఆర్టీసీ అని రాసి ఉంచిన ఓ లోగోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.
కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదన్నారు. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న లోగో ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు అని సజ్జనార్ వివరణ ఇచ్చారు.
#TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ… pic.twitter.com/n2L0rezuoo
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) May 23, 2024