Rahul Gandhi | న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎండలు దంచికొడుతున్నప్పటికీ గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఈ గరం గరం రాజకీయ ప్రచారం వేళ.. కాంగ్రెస్ పార్టీ ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియో ఏంటంటే రాహుల్ గాంధీ గురించి. తెల్ల టీ షర్టే ఎందుకు ధరిస్తున్నారని అడిగిన ప్రశ్నకు రాహుల్ చెప్పిన సమాధానం వైరల్ అవుతోంది. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఆ వీడియోను కర్ణాటకలో ఒక రోజు ఎన్నికల ప్రచారం పేరిట కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.
పారదర్శకతతో పాటు నిరాడంబరతను సూచిస్తుందనే ఉద్దేశంతోనే పాదయాత్రల్లో, ఎన్నికల ప్రచారంలో తెలుపు రంగు టీ షర్ట్ ధరిస్తున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సరళత్వం, నిరాడంబరత తనకు ఇష్టమైనవి అని వివరించారు. పేదలు, మహిళల అనుకూల భావజాలం, సమానత్వం, బహుళత్వ వాదం తదితర అంశాల్లో మన సైద్ధాంతిక దృక్పథాన్ని ప్రజలకు వివరించి వారిని ఒప్పించడం ముఖ్యం అని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఇక భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్రలోనూ రాహుల్ గాంధీ వైట్ కలర్ టీ షర్ట్‌లోనే దర్శనిమచ్చారు. ఆయన ధరిస్తున్న తెలుపు రంగు టీ షర్ట్‌పై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేశారు. అవేమీ లెక్క చేయని రాహుల్ తనకు ఇష్టమైన తెలుగు రంగు టీ షర్ట్‌లోనే ఆ రెండు యాత్రలు కొనసాగించారు. ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచారం వైట్ కలర్ టీ షర్ట్ ధరించి చేస్తున్నారు.
Fun rapid-fire questions and fantastic company—let’s keep the energy high!pic.twitter.com/H4Y5xfg87Y
— Congress (@INCIndia) May 5, 2024