Theatres| కరోనా తర్వాత థియేటర్స్‌కి జనాలు కాస్త తగ్గిన మాట నిజమే.కాకపోతే పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయిన సమయంలో థియేటర్స్ కళకళలాడుతుంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కొంత ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం. పెద్ద హీరో సినిమాలు అయితే వారికి కాస్త లాభం ఉంటుంది. లేదంటే థియేటర్ ఓనర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఓనర్లు ఓ నిర్ణయానికి వచ్చారు. రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపేయాలంటూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నారు. అన్నిరకాల పరిస్థితుల కారణంగా వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఇంకో వైపు ఎలక్షన్ హంగామా,ఐపీఎల్ సందడి , ఓటీటీలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు రావడం ఇలా అన్ని రకాలుగా కూడా ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదు. క్యుపెన్సీ తక్కువగా ఉండడంతో నష్టం వస్తుందని భావించిన థియేటర్ ఓనర్స్ రెండు వారాల పాటు థియేటర్స్ బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. థియేటర్ల అద్దెల విషయంలో కూడా నిర్మాతలు ఓ సారి ఆలోచన చేయాలంటూ వారు కోరుతున్నారు. సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాల సందడి మళ్లీ తెలుగు రాష్ట్రాల థియేటర్లలో కనిపించలేదు. సంక్రాంతికి ఒకేసారి ఏకంగా 4 స్టార్ల సినిమాలు విడుదల కాగా.. అందులో ‘హనుమాన్’ అయితే దాదాపు రెండు నెలల పాటు మంచి ఆక్యుపెన్సీతో థియేటర్స్‌లో ఆడింది.
ఆ తర్వాత మళ్లీ ఆ రేంజ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. జూన్ 27వ తేదీ కల్కీ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వరకు చిన్న సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే ‘ప్రేమలు’, ‘మంజుమ్మెల్ బాయ్స్’, ‘ది గోట్ లైఫ్’ వంటి మలయాళ హిట్ చిత్రాలు థియేటర్స్‌లోకి వచ్చిన కూడా అవి ఓటీటీలో ఉండడంతో థియేటర్స్‌లో చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపడం లేదు. అయితే రెండు వారాల పాటు థియేటర్స్ క్లోజ్ చేయాలనే నిర్ణయంతో రాజు యాదవ్, లవ్ మీ సినిమాలతో పాటు మరి కొన్ని చిన్న చిన్న సినిమా నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు.అయితే తెలంగాణా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఇలా ధియేటర్స్ ను తాత్కాలికంగా మూసివేయడం కరెక్ట్ కాదని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ అన్నారు. మీ వల్ల నిర్మాతలకు ,మల్టీప్లెక్స్ లకు కూడా ఇబ్బందే అంటూ ఆయన తెలియజేశారు.