Monday, December 30, 2024
HomeTelanganaKTR | ఓటు వేయ‌కుండా తర్వాత నిందిస్తే లాభం లేదు : కేటీఆర్

KTR | ఓటు వేయ‌కుండా తర్వాత నిందిస్తే లాభం లేదు : కేటీఆర్

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ నందిన‌గ‌ర్‌లోని జీహెచ్ఎంసీ క‌మ్యూనిటీ హాల్లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) త‌న కుటుంబంతో క‌లిసి ఓటేశారు. కేటీఆర్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి శైలిమ‌, కుమారుడు హిమాన్షు కూడా త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

ఓటేసిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలని ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలు. ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశం. మన ప్రభుత్వాలని మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఈరోజు ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదు. దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు వేయండి. మంచి ప్రభుత్వాలను మంచి నాయకులను మీ సమస్యలకు ప్రాతినిధ్యం వహించే వారికి ఓటు వేయండి. పోలింగ్ స్టేషన్లో దగ్గర కరెంటు కోతలు లేకుండా జనరేటర్లు పెట్టి ముగ్గురు ముగ్గురు అధికారులతోని తెలంగాణ ప్రభుత్వం కష్టపడుతుంది. తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ తెచ్చిన పార్టీకి నాయకుడు కేసీఆర్. తెలంగాణ కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం నేను ఓటు వేశాను అని కేటీఆర్ మీడియాతో అన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు