Friday, April 4, 2025
HomeHealthSummer | ఎండ‌లు మండిపోతున్నాయి.. పిల్ల‌ల విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..!

Summer | ఎండ‌లు మండిపోతున్నాయి.. పిల్ల‌ల విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..!

తెలుగు రాష్ట్రాల్లో ఎండ‌లు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో 46 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. అయితే ఈ ఎండ‌ను కూడా పిల్ల‌లు లెక్క‌చేయ‌రు. స్కూళ్ల‌కు సెల‌వులు ఉండ‌టంతో స్నేహితుల‌తో ఆడుకునేందుకు బ‌య‌ట‌కు వెళ్తుంటారు. ఎండ‌లోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతూ వ‌డ‌దెబ్బ‌కు గుర‌వుతుంటారు. డీహైడ్రేష‌న్ బారిన ప‌డుతారు. కాబ‌ట్టి వేసవిలో పిల్లలను సాధ్యమైనంత వరకు ఎండల్లో బయటికి వెళ్లనీయకపోవడమే ఉత్తమం. ఎండాకాలంలో ఎక్కువ శాతం ద్రవ పదార్థాలు ఇవ్వాలి. బయటి ఆహారానికి దూరంగా ఉంచాలి. ఒకవేళ బిడ్డలను బయటికి పంపాల్సి వస్తే ఎండ తగలకుండా తలకు టోపి, గొడుగు తప్పనిసరిగా వాడాలి.

ఈ జాగ్ర‌త్త‌లు తప్ప‌నిస‌రి..

  • ఎండాకాలంలో నాలుగేండ్ల లోపు పిల్లలకు ప్రతిరోజూ 1 నుంచి 1.5లీటర్ల నీరు తాగించాలి.
  • 4 నుంచి 9 ఏండ్ల పిల్లలకు 1.5 నుంచి 2 లీటర్ల నీరు తాగించాలి.
  • సాధ్య‌మైనంత వ‌ర‌కు కొబ్బ‌రి నీళ్లు, మ‌జ్జిగ‌, ఓఆర్ఎస్ వంటి ద్రావ‌ణాలు ఇవ్వాలి.
  • హోట‌ల్, బేక‌రీ ఫుడ్‌కు దూరంగా ఉంచాలి.
  • క‌లుషిత నీరును తాగ‌కూడ‌దు.
  • ప‌రిశుభ్ర‌త పాటిస్తూ త‌రచూ చేతుల‌ను స‌బ్బుతో క‌డుక్కోవాలి.
  • పిల్ల‌ల‌కు వ‌దులైన కాట‌న్ దుస్తులు ధ‌రించాలి.
  • పిల్ల‌ల‌ను ఉంచే ప్రాంతాన్ని చ‌ల్ల‌గా ఉండేలా చూడాలి.
  • పసిపిల్లలకు ఉదయం 8లోపు, సాయంత్రం 6 తరువాత మాత్రమే స్నానం చేయించాలి.
  • శిశువులకు అధికంగా తల్లిపాలు పట్టాలి. రబ్బరు డైపర్లు వాడకూడదు.
  • వేసవిలో ఎక్కువగా ఇండోర్‌ గేమ్స్‌ ఆడేలా చూడాలి.

డీహైడ్రేషన్‌ లక్షణాలు

  • వాంతులు, విరేచనాలు
  • నీరసంగా అనిపించడం
  • కళ్లు లోపలికి వెళ్లినట్లు కనిపించడం
  • నోరు ఎండిపోవడం
  • శరీర ఉష్ణోగ్రత పెరిగి జ్వరం రావడం
  • మూత్రం రాకపోవడం
  • మూత్రంలో మంట, పసుపు, ఎరుపు రంగులో మూత్ర విసర్జన
RELATED ARTICLES

తాజా వార్తలు