Sunday, December 29, 2024
HomeCinemaCine Stars|మ‌ద్యానికి ఆమ‌డ దూరంలో ఉండే సినీ స్టార్స్ ఎవ‌రో తెలుసా?

Cine Stars|మ‌ద్యానికి ఆమ‌డ దూరంలో ఉండే సినీ స్టార్స్ ఎవ‌రో తెలుసా?

Cine Stars| సినీ సెల‌బ్రిటీల‌కి మ‌ద్యం అల‌వాటు ఉండ‌డం కామ‌న్. పార్టీస్, ఫంక్ష‌న్స్ అంటూ ఉంటాయి కాబ‌ట్టి ఏదో ఒక సంద‌ర్భంలో మద్యం అల‌వాటు అవుతుంది. కొంద‌రు త‌మ‌కి మ‌ద్యం అలవాటు ఉంద‌ని ఓపెన్‌గా కూడా చెప్పేస్తారు. మ‌రి కొంద‌రు మాత్రం ఆ విష‌యాన్ని సీక్రెట్‌గా ఉంచుతారు. అయితే ఎంతో డ‌బ్బు ఉన్నా, స్టార్ స్టేట‌స్ ఉన్నా కూడా మ‌ద్యం ముట్ట‌ని కొంద‌రు సెల‌బ్రిటీస్ కూడా ఉన్నారు. వారిలో ముందుగా చెప్పుకోవ‌ల్సింది అమితాబ్ బ‌చ్చ‌న్ గురించి. 81 ఏళ్ల వయసులోనూ నటనలో అద్భుతంగా దూసుకెళ్తున్న అమితాబ్ బచ్చన్ ఒక‌ప్పుడు మ‌ద్యం తాగేవాడు. కాని 90ల‌లో మానేశారు. ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డం వ‌ల్ల కూడా ఆయ‌న మానేసి ఉండొచ్చు.

ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ మొదటి నుండి మ‌ద్యం, ధూమ‌పానం వంటి అల‌వాట్ల‌కి చాలా దూరం. అందుకే 56 ఏళ్ల వ‌య‌స్సులో కుర్రాడిలా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు.ఇక 51 ఏళ్ల వయ‌స్సు ఉన్న జాన్ అబ్ర‌హం కూడా మద్యానికి చాలా దూర‌మ‌ట‌. ఆయ‌న మ‌ద్యంతో పాటు స్కోకింగ్, షుగ‌ర్ వంటి వాటిని కూడా దూరంగా ఉంచుతాడ‌ట‌. గ‌త 25 ఏళ్లుగా ఆయ‌న షుగర్ తిన‌డం లేదు. అందుకే ఇప్ప‌టికీ అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిలా క‌నిపిస్తూ ఉంటారు. హీరోలే కాదు హీరోయిన్స్ సైతం డ్రింక్ చేస్తారు. కాని దీపికా ప‌దుకొణే మాత్రం మ‌ద్యం, ధూమ‌పానం రెండింటికి దూరం. 2018లో ఆమె ర‌ణ్‌వీర్‌ని వివాహం చేసుకొని సంతోషంగా ఉంది.

ఇక 48 ఏళ్ల అభిషేక్ బచ్చన్ కూడా త‌న తండ్రి అడుగు జాడ‌ల‌లో న‌డుస్తున్నారు. మ‌ద్య‌పానం,ధూమ‌పానం వంటి వాటికి మొద‌టి నుండి దూరం . ఇక బాలీవుడ్ బ్యూటీ ప‌రిణితీ చోప్రాకి కూడా ఎలాంటి చెడు అల‌వాట్లు లేవు. 2023లో ఆమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి చాలా సంతోషంగా ఉంది. ఇక రియ‌ల్ హీరో సోనూసూద్ సినిమాల‌లో విల‌న్‌గా కనిపించిన‌ప్ప‌టికీ బ‌య‌ట జెంటిల్‌మెన్. ఎలాంటి చెడు అల‌వాట్లు లేవు. ఇక త‌ను సంపాదించిన దాంట్లో కొంత సేవా కార్య‌క్ర‌మాల‌కి వినియోగిస్తూ అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతూ ఉంటారు. వీరే కాక సోనాక్షి సిన్హా, శిల్పా శెట్టి, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, ప్రియాంక చోప్రా వంటి వారు కూడా మద్యానికి దూరం

RELATED ARTICLES

తాజా వార్తలు