T20 World Cup| ఐపీఎల్ ముగిసిన వారానికి టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు జరగనున్న ఈ సమరం క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించనుంది. అయితే ఈ సారి భారత జట్టు యంగ్ అండ్ సీనియర్ ఆటగాళ్లతో బరిలోకి దిగుతుంది. మొత్తం 19 మంది ఆటగాళ్లు ఎంపిక కాగా, వీరిలో 15 మంది సభ్యులు ప్రధాన జట్టులో ఉన్నారు. మిగతా నలుగురిని రిజర్వ్ ప్లేయర్స్‌గా ఎంపిక చేశారు. అయితే వీరిలో ఆరుగురు ఆటగాళ్లకి ఇది తొలి ప్రపంచ కప్ కాగా వారు ఎలా రాణిస్తారని అందరు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ముందుగా యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ తొలిసారి టీ 20 ప్రపంచ కప్ ఆడనున్నాడు. అతను ఇప్పటివరకు 17 టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో 61.93 స్ట్రైక్ రేట్ ఉంది.
ఇక రెండో వికెట్ కీపర్‌గా ఎంపికైన శాంసన్‌కి కూడా ఇది తొలి ప్రపంచ కప్. అతను ఇప్పటివరకు 25 టీ20 మ్యాచ్‌లు ఆడగా, 133.09 స్ట్రైక్ రేట్‌తో 374 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్‌మెన్ శివమ్ దూబే భారత్ తరపున 21 టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో 276 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెలరేగి ఆడుతున్నాడు. ఇక మణికట్టు-స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కి కూడా ఇది తొలి ప్రపంచ కప్. మంచి ఫామ్‌లో ఉన్న అతను 35 మ్యాచ్‌లు ఆడాడు. అతని పేరు మీద 59 వికెట్లు ఉన్నాయి. ఇక యుజువేంద్ర చాహల్ భారత్ తరపున ఇప్పటివరకు 80 మ్యాచ్‌లు ఆడగా, అతనికి ఇది తొలి వరల్డ్ కప్ కావడం విశేషః.
ఇక హైదరాబాదీ బౌలర్ సిరాజ్ ఇప్పటి వరకు కేవలం 10 మ్యాచ్‌లు మాత్రమే ఆడగా, అతను ఫాస్ట్ బౌలర్ గా టీ20 ప్రపంచకప్‌లో కూడా ఆడనున్నాడు. ఏ మేరకు ప్రపంచ కప్‌లో రాణిస్తాడు అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో తేలిపోయిన సిరాజ్ కనీసం ప్రపంచ కప్‌లో అయిన రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. టీ 20 వరల్డ్ కప్ స్టార్ట్ అయిన తొలిసారి కప్ కొట్టిన టీమిండియా ఇప్పటి వరకు మళ్లీ అందుకుంది లేదు. ఈ సారైన రోహిత్ నాయకత్వంలో తిరిగి కప్ కొట్టాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు.