హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తయిన నేపథ్యంలో ఇది తెలంగాణ దశాబ్ది..వెయ్యేండ్లయినా చెక్కుచెదరని పునాది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఆరున్నర దశాబ్దాల పోరాటం, మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు, వేల బలిదానాలు, త్యాగాలు.. బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు, ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్షతో ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయ్యిందని పేర్కొన్నారు.
”ఇది తెలంగాణ దశాబ్ది!
ఆరున్నర దశాబ్దాల పోరాటం..
మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు..
వేల బలిదానాలు, త్యాగాలు..
బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు..
ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష..
ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయ్యింది!
ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా
స్వతంత్ర భారతదేశం ముందెన్నడూ చూడని
సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా ఆవిష్కారం అయ్యింది!
పల్లె, పట్నం తేడా లేకుండా
ప్రగతి రథం పరుగులు తీసింది.
ఆహార ధాన్యాల ఉత్పత్తి నుండి
ఐటి ఎగుమతుల దాకా
రికార్డులు బద్దలయ్యినయి.
మీ అందరి మద్దతుతో
నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచినం.
నిరంతర కరెంటిచ్చి వెలుగులు నింపినం.
రైతన్నల, నేతన్నల, కష్టజీవుల
కలత తీర్చినం.. కడుపు నింపినం.
వృద్ధులకు ఆసరా అయినం..
ఆడబిడ్డలకు అండగా నిలిచినం.
సకల జనుల సంక్షేమానికి తెలంగాణను చిరునామా చేసినం.
గుండెల నిండా జై తెలంగాణ
నినాదం నింపుకున్నం.
మన భాషకు పట్టం గట్టినం.
మన బతుకమ్మ, మన బోనం
సగర్వంగా తలకెత్తుకున్నం.
గంగా జమునా తెహజీబ్ కు
సాక్షీభూతంగా నిలిచినం.
అవమానాలు
అవహేళనలు
ఎదుర్కొన్న గడ్డ మీదనే
తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని
అంబరమంత ఎత్తున ఎగరేసినం.
కేసీఆర్ పాలన సాక్షిగా
ఇది తెలంగాణ దశాబ్ది!
వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని పునాది!”
ఇది తెలంగాణ దశాబ్ది!
ఆరున్నర దశాబ్దాల పోరాటం..
మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు..
వేల బలిదానాలు, త్యాగాలు..
బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు..
ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష..
ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయ్యింది!ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా
స్వతంత్ర… pic.twitter.com/i7WD2IwOC2— KTR (@KTRBRS) May 21, 2024