Sunday, December 29, 2024
HomeTelanganaకోచింగ్ సెంటర్ సెల్లార్ లోకి వ‌ర‌ద నీరు, ముగ్గురు విద్యార్థులు మృతి

కోచింగ్ సెంటర్ సెల్లార్ లోకి వ‌ర‌ద నీరు, ముగ్గురు విద్యార్థులు మృతి

ఢిల్లీలోని రావుస్ ఐఎఎస్ కోచింగ్ సెంట‌ర్ లోని సెల్లార్ లోకి ఒక్క‌సారిగా వ‌ర‌ద నీరు రావ‌డంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ప‌లువురు విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. మృతులలో తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల‌కు చెందిన తాన్యా సోని(25), యూపీకి చెందిన శ్రేయా యాద‌వ్(25), కేర‌ళ‌కు చెందిన న‌వీన్ డాల్విన్(24) ఉన్నారు.

కోచింగ్ సెంట‌ర్ లోని సెల్లారు లో యాజ‌మాన్యం లైబ్రరీని నిర్వ‌హిస్తుంది. ఈ భ‌యాన‌క సంఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో ప‌దుల సంఖ్య‌లో విద్యార్థులు లైబ్ర‌రీలో చ‌దువుకుంటున్నారు. కేవ‌లం 5 నిమిషాల వ్య‌వ‌ధిలోనే మురికిగా ఉండే వ‌ర‌ద‌నీరు ముంచెత్త‌డంతో విద్యార్థులు భ‌య‌బ్రాంతుల‌కు గుర‌య్యారు. కోచింగ్ సెంట‌ర్ ఉద్యోగులు అందించిన తాడు స‌హాయంతో మిగ‌తా విద్యార్థులు ప్ర‌మాదం నుండి బ‌య‌ట ప‌డ్డారు.

RELATED ARTICLES

తాజా వార్తలు