Monday, December 30, 2024
HomeNationalViral Video | రోడ్డు దాటుతున్న పులిని ఢీకొట్టిన కారు.. విలవిలలాడుతూ..! నెట్టింట వీడియో వైరల్‌..

Viral Video | రోడ్డు దాటుతున్న పులిని ఢీకొట్టిన కారు.. విలవిలలాడుతూ..! నెట్టింట వీడియో వైరల్‌..

Viral Video | రోడ్డు దాటుతున్న పులిని ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పులి చివరకు ప్రాణాలు వదిలింది. ఈ ఘటన మహారాష్ట్ర భండారా-గోందియా హైవైపే చోటు చేసుకున్నది.. వివరాల్లోకి వెళ్తే.. నావెగావ్ నగ్జీరా శాంక్చువరీ సమీపంలో అర్ధరాత్రి వేళ పులి రోడ్డు దాటుతున్నది. ఈ క్రమంలో అటువైపుగా వేగంగా వచ్చిన కారు పులిని ఢీకొట్టింది. దాంతో పులి ముందడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధతో విలవిలలాడుడూ గ్రాండించింది. వెనుక కాళ్లతో ముందుకు వెళ్తూ రోడ్డున దాటింది. ఆ తర్వాత తీవ్ర గాయాలతో అల్లాడుతూ ప్రాణాలు వదిలింది. ప్రస్తుతం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. వీడియో ప్రకారం.. పెద్ద పులి రోడ్డుపై పడిపోగా పడిపోగా.. దాని ముందు హ్యుండాయ్ క్రెటా కారు ఆగి ఉంది. పూర్తిగా నిలిగిపోయిన కాళ్లతో రోడ్డు దాటిన పులి.. పొదల్లోకి వెళ్లింది. వెనుకలా ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. గాయపడ్డ పులిని కాపాడేందుకు ప్రయత్నించారు. నాగ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూసింది. అయితే, వణ్య ప్రాణాలు ప్రమాదాల బారినపకుండా చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. అభయారణ్యం మీదుగా ప్రయాణించేటప్పుడు వాహనాలు నెమ్మదిగా నడపాలనే హెచ్చరిక బోర్డులు ఉన్నాయని.. అయినా కారు డ్రైవర్‌ పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది.

ఎన్‌హెచ్-753లో భాగంగా అటవీ ప్రాంతంలోని ఈ మార్గం సింగిల్ రోడ్డు అని, ఇక్కడ గంటకు సగటున 40 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాల్సి ఉంటుందని మరో వ్యక్తి చెప్పుకువచ్చాడు. నిర్లక్ష్యంగా కారు నడిపిన డ్రైవర్‌పై నెటిజన్స్‌ మండిపడుతున్నారు. అడవులు, వన్యప్రాణులు సంచరించే మార్గాల్లో ఎందుకు వేగంగా నడుపుతున్నారనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాత్రి సమయాల్లో ఆయా మార్గాలను మూసివేయాలని పలువురు జంతుప్రేమికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు