Saturday, December 28, 2024
HomeSpiritualTirumala | తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. నేడే ఆర్జిత సేవా కోటా టికెట్ల విడుదల..!

Tirumala | తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. నేడే ఆర్జిత సేవా కోటా టికెట్ల విడుదల..!

Tirumala | తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌. ఆగస్టు మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ శనివారం (మే 18) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టికెట్ల కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం ఉన్నది. టికెట్ల పొందిన భక్తులు 20 నుంచి 22 వరకు మధ్యాహ్నం 12 గంటల్లోగా డబ్బులు చెల్లిస్తే లక్కీ డిప్‌ టికెట్లు మంజూరవుతాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, అదేవిధంగా శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 15 నుంచి 17వ వ‌ర‌కు నిర్వహించ‌నున్న వార్షిక ప‌విత్రోత్సవాల సేవా టికెట్లను 21న ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. 21న వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల ఆన్ లైన్ కోటాను 23న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచనున్నది. తిరుమల, తిరుపతిల‌లో ఆగ‌స్టు నెల గదుల కోటాను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. మే 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నది. భక్తులు ఆయా టికెట్లను ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవాలని కోరింది.

RELATED ARTICLES

తాజా వార్తలు