Saturday, December 28, 2024
HomeSpiritualTirupati | ధ్వజారోహణంతో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు షురూ..

Tirupati | ధ్వజారోహణంతో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు షురూ..

Tirupati | తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా మొదలయ్యాయి. ఆలయంలో గురువారం ఉదయం 8.15 నుంచి 8.40 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించి.. సకల దేవతలకు ఆహ్వానం పంపారు. అంతకు ముందు గోవిందరాజస్వామి ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై మాడ వీధుల్లో విహరించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఊరేగింపు ద్వారా ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి.

ఆ తర్వాత అర్చకులు అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ట , రక్షా బంధనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలతో పాటు సకల దేవతలను ఈ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణం కార్యక్రమం వెనుక ప్రధాన ఉద్దేశం. ఆ తర్వాత ఉద‌యం 10.30 గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఉత్సవర్లకు వైభవంగా స్వపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం నిర్వహించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు