మేషం
ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించక తప్పదు.
వృషభం
అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
మిథునం
పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి.
కర్కాటకం
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సింహం
తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థికపరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతనకార్యాలు ప్రారంభించకూడదు.
కన్య
తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి.
తుల
ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
వృశ్చికం
గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. శారీరకంగా బలహీనులవుతారు.
ధనుస్సు
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది.
మకరం
ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ప్రయత్నకార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు.
కుంభం
దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు.
మీనం
అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి.