హైదరాబాద్: ఐపీఎల్‌లో (IPL) మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లోకల్ టీం సన్‌రైజర్స్ హైదరాబాద్.. గుజరాత్ టైటాన్స్‌తో పోరాడనుంది. ఇప్పటికే ప్లేఆఫ్ బరి నుంచి తప్పుకున్న గిల్ సేన.. విజయంతో సీజన్‌ను ముగించాలని అనకుంటున్నది. మరి రాత్రి 7.30 గంటలకు జరుగనున్న మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీని గుజరాత్ ఏవిధంగా ఎదుర్కొంటుంతో చూడాల్సిందే.
ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్‌కు టీఎస్ ఆర్టీసీ (TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న మ్యాచ్ కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం టీఎస్ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులు నడపనుంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
ఏయే రూట్లలో అంటే..
గురువారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ తెలిపింది. మొత్తం 24 రూట్లలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. మియాపూర్, ఘట్‌కేసర్, ఎన్జీవోస్ కాలనీ, చార్మినార్, జీడిమెట్ల నుంచి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి నాలుగు చొప్పున ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, ల్యాబ్ క్వార్టర్స్, కోఠి, అఫ్జల్ గంజ్, లక్డీకాపూల్, దిల్‌సుఖ్‌నగర్, కేపీహెచ్‌బీ, మేడ్చల్, జేబీఎస్, ఈసీఐఎల్, బోయిన్‌పల్లి, చాంద్రాయణగుట్ట, కొండాపూర్, ఎల్బీనగర్, బీహెచ్‌ఈఎల్ నుంచి ఉప్పల్ స్టేడియానికి రెండు చొప్పున ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. స్టేడియం పరిసరాల్లో ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు కంట్రోలర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్ బృందాలు అందుబాటులో ఉంచింది.
Absolutely wonderful ✊👏