Mayo Hospital | ఈ ఏడాది ప్రపంచంలోనే బెస్ట్ హాస్పిటల్లో అమెరికాలోని మయో క్లినిక్ నిలిచింది. ఈ జాబితాలో అత్యుత్తమమైన ఐదు ఆసుపత్రుల్లో నాలుగు అమెరికా ఆసుపత్రులే కావడం విశేషం. వీటిలో క్లీవ్‌లాండ్‌లోని క్లీవ్‌లాండ్ క్లినిక్, టొరొంటోలోని టొరొంటో జనరల్, బాల్టిమోర్‌లోని జాన్ హాప్కిన్స్ ఆసుపత్రి, బోస్టన్లోని మేరీల్యాండ్, మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి ఉన్నాయి. టొరొంటో ఆసుపత్రి ఈ సారి రెండో స్థానాలు ఎగబాకింది. యూరప్‌కు చెందిన పలు ఆసుపత్రులు సైతం రికార్డుల్లో చోటు సంపాదించాయి.
బెర్లిన్‌లోని చారిటే యూనివర్సిటీ, స్వీడన్‌లోని కరోలిన్స్కా యూనివర్సిటెట్స్జెఖుసెట్, పారిస్‌లోని హోపిటల్ యూనివర్సిటీ పిటీ సల్పెట్రీర్ తదితర హాస్పిటల్లో చోటు దక్కించుకున్నాయి. టాప్-10 జాబితాలో ఇజ్రాయెల్‌కు చెందిన షేబా మెడికల్ సెంటర్, స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్ జ్యురిచ్ ఉన్నాయి. ప్రముఖ డేటా సేకరణ సంస్థ స్టాటిస్టా, న్యూస్ మేగజైన్ న్యూస్‌వీక్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలను సంస్థ విడుదల చేసింది. 30 దేశాల్లో 85వేల మంది వైద్య నిపుణుల అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ వివరాలను వెల్లడించింది.