USA vs BAN| మరి కొద్ది రోజులలో టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే .అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా, జూన్ 2వ తేదీ నుండి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే, టీ20 ప్రపంచ కప్ కు ముందు కొన్ని జట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా- బంగ్లాదేశ్‌ల మధ్య టీ20 సిరీస్ నడిచింది. ఇందులో బంగ్లాదేశ్‌ను అమెరికా చిత్తు చేసి ఏకంగా టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్నది. కొద్ది రోజుల క్రితం ఐర్లాండ్ కూడా పాకిస్తాన్‌ని మట్టికరిపించడం మనం చూశాం. టీ20 వరల్డ్ కప్‌లో తమని పసికూనలుగా భావిస్తే మూల్యం చెల్లించుకుంటారు అనేలా ఐర్లాండ్, అమెరికా హింట్ ఇచ్చారు.
ఇప్పటికే తొలి టీ20 బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన అమెరికా రెండో టీ20లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. అమెరికా క్రికెట్ చరిత్రలో ఇది అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. రెండో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసింది. అమెరికాకు కెప్టెన్ కమ్ ఓపెనర్ మోనాక్ పటేల్ 38 బాల్స్‌లో నాలుగు ఫోర్లు ఓ సిక్సర్‌తో 42 రన్స్ చేయగా, టేలర్ ఇరవై ఎనిమిది బాల్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 రన్స్ చేసాడు. వీరిద్దరు జట్టుకి విలువైన పరుగులు అందించారు. అయితే అమెరికా భారీ స్కోరు చేసేలా కనిపించిన మిగిలిన బ్యాట్స్‌మెన్స్ విఫలం కావడంతో మోస్తరు స్కోరు చేశారు.
145 పరుగుల తక్కువ టార్గెట్‌ను ఛేదించడంలో బంగ్లాదేశ్ తడబడింది. 19.3 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో ఆరు పరుగుల తేడాతో అమెరికా చేతిలో ఓడిపోయింది. షకీబ్ అల్ హసన్ (30 రన్స్), కెప్టెన్ షా (36 రన్స్) బంగ్లాను గెలిపించేందుకు చాలా ప్రయత్నించిన కూడా కీలక సమయంలో ఔట్ కావడంతో బంగ్లా ఓటమిపాలైంది. బంగ్లాదేశ్ చివరి ఆరు వికెట్లను 14 పరుగుల వ్యవధిలో కోల్పోవడం విశేషం . అగ్ర ప్లేయర్లతో బరిలో దిగిన బంగ్లాదేశ్ అమెరికా లాంటి పసికూనను ఓడించలేక చతికిలపడటంతో ఆ దేశ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో నేపాల్, నెదర్లాండ్స్ లాంటి జట్లపై కూడా బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. అయితే అమెరికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండు టీ20లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న అమెరకా మూడో టీ20 మ్యాచ్ మే 25న బంగ్లాదేశ్ తో ఆడనుంది.