Saturday, December 28, 2024
HomeSpiritualTirumala | తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.. ఉత్సవాల ప్రత్యేక ఏంటంటే..?

Tirumala | తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.. ఉత్సవాల ప్రత్యేక ఏంటంటే..?

Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు వైభవోపేతంగా జరుగనున్నాయి. వేడుకలకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఏటా వసంతోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. 21న ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు మాడవీధుల్లో విహరిస్తారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేసి.. వసంతోత్సవ అభిషేక, నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయంలోకి చేరుకుంటారు.

22న ఉభయదేవేరులతో కలిసి ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వర్ణ రథంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు 23న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారితో పాటుగా సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి విచ్చేస్తారు. ఉత్సవాల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరుపుతారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు.

వసంత రుతువులో మలయప్పస్వామివారికి జరిగే ఈ వేడుకనే ‘వసంతోత్సవం’గా మారింది. సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించడంతో పాటు వివిధ రకాల ఫలాలను సైతం నివేదించడం ఉత్సవంలో ప్రధాన ప్రక్రియ. ఈ వేడుకలను సందర్భంగా 23న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 21 నుంచి 23 వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

RELATED ARTICLES

తాజా వార్తలు