అస్వస్థతకు గురై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజీ రాజ్యసభ సభ్యులు కేశవరావు పెద్ద కుమారుడు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ విప్లవ కుమార్ సోదరుడు అయిన వెంకటేశ్వరరావును మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరిమర్శించారు.
వెంకటేశ్వర రావు ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఉన్నారు.