Vijay Antony| సెలబ్రిటీలు బయటకి వచ్చిన లేదంటే ఇంట్లో ఉన్నా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా కాళ్లకి చెప్పులు లేనిది వారు బయట అడుగుపెట్టరు. స్వామి మాల ధరించినప్పుడు మాత్రం చెప్పులు లేకుండా నడుస్తుండడం మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఓ హీరో మాల కూడా ధరించకుండా జీవితాంతం చెప్పులు లేకుండా ఉంటానంటూ స్టన్నింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇంతకు ఆ హీరో ఎవరనేదే కదా మీ డౌట్. మరెవరో కాదు తమిళ హీరో విజయ్ ఆంటోని.
బిచ్చగాడు సినిగమాతో తెలుగు ప్రేక్షకులకి కూడా చాల దగ్గరైన విజయ్ ఆంటోని ఇటీవల ‘లవ్ గురు’ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. ఈ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని నటిస్తున్న మూవీ ‘తుఫాన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా లు నిర్మిస్తున్నారు.పొయిటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జోనర్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంతో శరత్‌కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. అచ్చు రాజమణి, విజయ్ ఆంటోని సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.
కొన్ని జీవితాలు తక్కువ అనే ఆలోచన ప్రపంచంలోని తప్పులన్నింటికీ మూలం అనే వ్యాఖ్యలతో టీజర్ ప్రారంభం కాగా, ఈ టీజర్‌ని చూశాక ఇది ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని అర్ధమవుతుంది. అయితే ఈ ఈవెంట్‌కి విజయ్ ఆంటోని చెప్పులు లేకుండా వచ్చాడు. ఆ సమయంలో మీడియా విజయ్ ఆంటోనిని ప్రశ్నించింది. దానికి విజయ్ ఆంటోని సమాధానమిస్తూ.. చెప్పులు లేకుండా బాగానే ఉంది. మొదట్లో కొంచెం పెయిన్ ఉంటుంది. ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఆ ఆతర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. ఆరోగ్యానికి కూడా మంచిదే. జీవితాంతం ఇలాగే చెప్పులు లేకుండా ఉండాలని ఫిక్స్ అయ్యాను, కావాలంటే మీరు కూడా ట్రై చేయండి అని తెలిపారు. కొన్నాళ్ల క్రితం విజయ్ ఆంటోని కూతురు మరణించగా, ఆ తర్వాత నుండి ఆయన కాస్త వేదాంతం మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.