Thursday, January 2, 2025
HomeCinemaVijay Devarakonda | పొలిటికల్‌ డ్రామాగా విజయ్‌ దేవరకొండ మూవీ..!

Vijay Devarakonda | పొలిటికల్‌ డ్రామాగా విజయ్‌ దేవరకొండ మూవీ..!

Vijay Devarakonda | యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. సినిమా బాగానే ఉన్నా ఎందుకో నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. తాజాగా కొత్త సినిమాను ప్రకటించాడు. రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో పొలిటికల్‌ డ్రామాగా మూవీ తెరకెక్కబోతున్నది. ఈ విషయాన్ని డైరెక్టర్‌ రవి కిరణ్‌ వెల్లడించాడు. రెండో సినిమా కావడంతో కొంచెం సమయం తీసుకొని చేస్తున్నట్లు తెలిపారు. పొలిటికల్ డ్రామా కావడంతో ఎక్కువ స్టడీ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

ఏ పాయింట్ చెప్పినా ఏదో ఇచ్చాం అన్నట్టు కాకుండా పర్‌ఫెక్ట్‌గా చెప్పాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. చూసే వాళ్లకు సిల్లీగా అనిపించకుండా గొప్పగా అనిపించాలనే ఉద్దేశంతో ఎక్కువ టైమ్ తీసుకొని స్టోరీని రాసినట్లు ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌రాజు నిర్మించనున్నారు. డైరెక్టర్ రవికిరణ్ కోలా తొలి సినిమా ‘రాజావారు రాణిగారు’తోనే హిట్ అందుకున్నారు. విజయ్‌ ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో ఓ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కనున్నది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వీడీ 12 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూ.100కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్నది.

RELATED ARTICLES

తాజా వార్తలు