Black Cobra | సాధారంగా చాలామంది పాము అంటేనే భయంతో వణికిపోతారు. కండ్ల ముందే కనిపిస్తే ఆమడదూరం పరుగెత్తుతారు. ఇక పడగవిప్పి బుసలు కొడితే చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా భారతీయ సంస్కృతిలో పాములను పూజించడం ఆనవాయితీగా వస్తున్నది. ఏడాదికోసారి నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోస్తుంటారు. ఆలయాల్లోనూ నాగదేవతా విగ్రహాలకు పూజలు చేస్తుండడం మనం చూస్తునే ఉంటాం. కానీ, ఓ కుటుంబం ఏకంగా నల్ల త్రాచుకు తమ ఇంట్లోనే పూజలు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఉన్న సంఘటన ఎక్కడి జరిగిందో స్పష్టంగా తెలియడం లేదు. కానీ.. వీడియోను తీక్షణంగా పరిశీలిస్తే శివరాత్రి రోజున ఆ కుటుంబం పామును పూచించినట్లు తెలుస్తున్నది.
వెడెల్పు ఉన్న పాత్రలో పామును ఉంచి.. దాని చుట్టూ కుటుంబీకులు కూర్చొని ఉన్నారు. అర్చకుడు వేదమంత్రాలు పఠిస్తుండగా.. కుటుంబ సభ్యులంతా పాముపై నెమ్మదిగా పాలు పోయడం కనిపించింది. పాలు పోస్తున్న సమయంలో పాములు బుసలు కొడుతూ ముందుకు దూసుకువచ్చింది. ఓకార్ సనాతని అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది. హిందూ సంస్కృతిలో శివుడు, నాగ దేవతకు ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన పోస్ట్‌లో వివరించారు. ఈ వీడియోను 4లక్షల మందికిపైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. పాముకు ప్రత్యక్షంగా పూజలు చేయడంపై పలువురు విమర్శించగా.. మరికొందరు వారి ధైర్యానికి ప్రశంసలు తెలిపారు.
View this post on Instagram