Virat Kohli| పిచ్చి పలు రకాలు. కొందరు సినిమా హీరోలు లేదంటే స్పోర్ట్స్ పర్సన్స్‌పై అమితమైన ప్రేమ చూపిస్తూ వార్తలలో నిలుస్తుంటారు. తాజాగా ఓ అభిమాని కోహ్లీ చిత్రాన్ని రక్తంతో గీసి ఫ్రేమ్ కట్టించడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు. ఆర్సీబీ తరపున ఆడుతున్న కోహ్లీ ప్రతి మ్యాచ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టోర్నీలో 700 కు పైగా పరుగులు సాధించిన రన్ మెషిన్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించే దిశగా కోహ్లి నిలిచాడు.
ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీ కాగా, ఆయన ఐపీఎల్‌లో 8000 పరుగులు పూర్తి చేసేందుకు 29 పరుగుల దూరంలో ఉన్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై కోహ్లి 29 పరుగులు చేస్తే, ఐపీఎల్‌లో 8000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త రికార్డ్ సృష్టించడం ఖాయం. కోహ్లీ రికార్డులని అలా ఊదేస్తుంటాడు. ఇదంతా పక్కన పెడితే విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన ఓ కళాకారుడు రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటాన్ని గీసి ఫ్రేమ్ కట్టించుకున్నాడు. కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్ జిల్లా రబకవి-బనహట్టి తాలూకాలోని మహాలింగపురానికి చెందిన శివానంద నీల్‌నూర్ విరాట్ కోహ్లీ చిత్రాన్ని రక్తంతో గీసి అందరిని ఆశ్చర్యపరిచాడు.
2008 నుంచి ఆర్‌సీబీకి ఫ్యాన్ అయిన శివానంద్ మహాలింగాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆర్ట్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే తను వేసిన పెయింటింగ్ విరాట్ కోహ్లీ చూడాలని మనోడు కోరుకుంటున్నాడు. అందరు తనని అభినందిస్తున్నా విరాట్ కోహ్లీ తన ఆర్ట్ చూస్తే చాలా సంతోషంగా ఉంటుందని మనసులో మాట బయటపెట్టాడు. ఇక ఇదిలా ఉంటే కోహ్లీ లీగ్స్‌లో 14 మ్యాచ్ ల్లో ఒక సెంచరీ.. 5 అర్ధ సెంచరీలతో 708 పరుగులు చేసాడు.ఇక ఈ రోజు ఆర్ఆర్ తో మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈ రోజు ఆర్సీబీ విజయం సాధిస్తే ఎలిమినేటర్‌కి చేరుకుంటారు. లేదంటే ఇంటిదారి పట్టాల్సిందే. అయితే ఆర్సీబీని కోహ్లీ భయపెడుతున్నాడు. కోహ్లీ ప్లే ఆఫ్స్ లో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో కోహ్లీ 14 మ్యాచ్ లు ఆడాడు. కేవలం 308 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 25.66 కాగా.. స్ట్రయిక్ రేట్ 120.31. కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. మరి నేటి మ్యాచ్‌లో ఎలాంటి అద్భుతం చేస్తాడో చూడాలి.