Vishwak Sen| ఈ మధ్య కాలంలో విశ్వక్ సేన్, బాలకృష్ణ తరచుగా కలిసి కనిపిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అన్‌స్టాపబుల్ షోలో ఈ ఇద్దరు కలిసి ఎంత సందడి చేశారో మనం చూశాం. ఇక ఇప్పుడు విష్వక్ సేన్ హీరోగా దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలయ్య చీఫ్ గెస్ట్‌గా హాజరై సందడి చేశారు. ఈ ఈవెంట్‌లో బాలయ్య మాట్లాడుతూ.. ఒక తల్లికి పుట్టకపోయినా నన్ను, విష్వక్‌ని కవలలే అంటుంటారు. అతడికంటే నేను చిన్నోడిని అని చెప్పి నవ్వులు పూయించారు. ప్రతి సినిమాలో విశ్వక్ సేన్ వైవిధ్యం చూపిస్తారని, నాలాగే ప్రతి సినిమాకి కొత్తదనం చూపించాలని ఎంతో తపన పడుతుంటాడని బాలయ్య అన్నారు. ఉడుకు రక్తం, నాలాగే దూకుడుతనం కూడా విశ్వక్ సేన్‌లో ఉందని బాలయ్య తెలియజేశారు.
ఇక విశ్వక్ సేన్ మాట్లాడుతూ. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లారీ మీద నుంచి తాను పడిపోయినట్టు తెలిపాడు విశ్వక్ సేన్. అయితే ఆ సమయంలో మోకాలికి దెబ్బ తగిలింది. ఆల్మోస్ట్ మోకాలు చిప్ప విరిగిపోయిందట, రెండేళ్లు మంచానికే పరిమితం అవుతానేమోనని భయం వేసింది. కాని అదృష్ట కొద్ది ఏం జరగలేదు. అయితే కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాను. ఆ సమయంలో బాలకృష్ణ గారు నాకు కాల్ చేసి దాదాపు పావు గంట మాట్లాడారు. నా ఆరోగ్యం గురించి ఆయన తీరా తీస్తుంటే ఏడ్చేశాను కూడా. ఆయన గొంతులో గాంబీర్యం ఉంటుంది. కానీ నాకు ఇలా జరిగింది అని తెలిసాక చాలా బాధపడ్డారు. నీ గురించి చాలా బాధపడుతున్నాను అని ఆయన అంటుంటే ఏడ్చేశాను. నా కుటుంబం తర్వాత నాపై అంత ప్రేమ చూపించేది బాలయ్య గారేనని విశ్వక్ సేన్ అన్నాడు.
ఇక ఈ ఈవెంట్‌లో హైపర్ ఆది మాట్లాడిన మాటలు కూడా జనాలకి మంచి కిక్ ఇచ్చాయి. నందమూరి నటసింహం, కొణిదెల కొదమసింహం అసెంబ్లీలో అడుగు పెట్టబోతోన్నాయని అన్నారు. నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో, మాన్షన్ హౌస్ వేస్తే ఎంత కిక్ వస్తుందో.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసినా అంతే కిక్ వస్తుందంటూ చెప్పేసరికి ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయింది.