Friday, January 3, 2025
HomeBusinessVivo V30e | సూప‌ర్ ఫీచ‌ర్స్‌తో Vivo V30e.. నిన్న‌టి నుంచే సేల్స్ ప్రారంభం..

Vivo V30e | సూప‌ర్ ఫీచ‌ర్స్‌తో Vivo V30e.. నిన్న‌టి నుంచే సేల్స్ ప్రారంభం..

Vivo V30e | ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల కాలం న‌డుస్తోంది. కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లోకి వ‌స్తున్నాయి. దీంతో వినియోగ‌దారులు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోన్ల‌ను కొనుగోలు చేసి వాడేస్తున్నారు. అయితే ఇప్పుడు సరికొత్త ఫీచ‌ర్ల‌తో వివో వీ 30ఈ(Vivo V30e) స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. నిన్న‌టి నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి వ‌చ్చింది. సేల్స్ కూడా ప్రారంభ‌మ‌య్యాయి. ఫ్లిప్‌కార్ట్, వివో ఈ-స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్, ఐడీఎఫ్‌సీ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ బ్యాంకుల వినియోగదారులకు అయితే 10 శాతం ఫ్లాట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.

Vivo V30e ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

  • క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది.
  • వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్‌ను అందించారు.
  • బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్ కాగా, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
  • ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై వివో వీ30ఈ రన్ కానుంది.
  • 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు.
  • స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, స్క్రీన్ టు బాడీ రేషియో 93.3 శాతంగా ఉంది.
  • ర్యామ్‌ను వర్చువల్‌గా 16 జీబీ వరకు పెంచుకోవచ్చు.
  • 5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, బైదు, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీని అందించారు.
  • ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఫోన్ అన్‌లాక్ చేయవచ్చు.

50 మెగాపిక్సెల్ కెమెరా..

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా అందించారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ సెన్సార్ వివో వీ30ఈలో ఉంది. ముందు, వెనక కెమెరాలు రెండిటికీ 4కే రికార్డింగ్ సామర్థ్యం ఉంది. 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు