Thursday, April 3, 2025
HomeNationalMamata Banerjee | మ‌ళ్లీ ప‌డిపోయిన బెంగాల్ సీఎం మ‌మ‌త‌.. ఎన్నిక‌ల స్టంటేనా?

Mamata Banerjee | మ‌ళ్లీ ప‌డిపోయిన బెంగాల్ సీఎం మ‌మ‌త‌.. ఎన్నిక‌ల స్టంటేనా?

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి గాయ‌ప‌డ్డారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు హెలికాప్టర్‌ ఎక్కిన దీదీ అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో స్వ‌ల్పంగా గాయ‌ప‌డిన‌ప్ప‌టికీ య‌ధావిధిగా త‌న ప్ర‌చారాన్ని కొన‌సాగించారు. పశ్చిమ వ‌ర్ధమాన్‌ జిల్లాలోని దుర్గాపుర్‌ నుంచి అసన్‌సోల్‌ వెళ్లేందుకు మ‌మ‌త హెలికాప్టర్‌ ఎక్కారు. లోపలికి వెళ్లి సీట్లో కూర్చునే సమయంలో బ్యాలెన్స్‌ కోల్పోయి కిందపడ్డారు. గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే ఆమెను పైకిలేపారు.

ఈ ఘటనలో ముఖ్య‌మంత్రికి స్వల్పంగా గాయమైందని, అయినప్పటికీ తన ప్రయాణాన్ని కొనసాగించారని అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని వెల్ల‌డించారు. అసన్‌సోల్‌ స్థానంలో అధికార టీఎంసీ నుంచి ప్ర‌స్తుత‌ ఎంపీ శతృఘ్నసిన్హా పోటీ చేస్తున్నారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా దీదీ ప్ర‌చారం నిర్వ‌హించారు. కాగా, త‌ర‌చూ ఎన్నిక‌ల ముందే ఆమె ఎందుకు కింద‌ప‌డిపోతుండ‌టంపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదంతా ఎన్నిక‌ల స్టంటే నంటూ విప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి.

దీదీ ఇప్ప‌టివ‌ర‌కు గాయ‌ప‌డిన సంద‌ర్భాలు..

  • 2024 మార్చిలో మ‌మ‌త నుదిటిపై గాయ‌మైంది. దీనికి సంబంధించి ర‌క్తం కారుతున్న ఆమె ఫొటోల‌ను పార్టీ విడుద‌ల‌చేసింది.
  • 2023 సెప్టెంబ‌ర్‌లో స్పెయిన్ ప‌ర్య‌ట‌న‌లో ఎడ‌మ‌కాలికి గాయ‌మైంది.
  • 2023 జూన్‌లో ఆమె ప్ర‌యాణిస్తున్న హెలికాఫ్ట‌ర్ కుదుపుల‌కు గుర‌వ‌డంతో అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ అయింది. ఈ సంద‌ర్భంగా ఆమె మోకాలికి స్వ‌ల్ప గాయ‌మైంది.
  • 2021 మార్చి నెల‌లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు నామినేష‌న్ ప‌త్రాలు దాఖలు చేసిన సంద‌ర్భంగా జ‌రిగిన దాడిలో ఆమె కాలికి గాయ‌మైంది. త‌ర్వాత వీల్ చైర్‌లోనే ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు.
RELATED ARTICLES

తాజా వార్తలు