Monday, December 30, 2024
HomeHealthSalt | ఉప్పు అతిగా తీసుకుంటే వ‌చ్చే అన‌ర్ధాలు ఏంటి?

Salt | ఉప్పు అతిగా తీసుకుంటే వ‌చ్చే అన‌ర్ధాలు ఏంటి?

Salt | మ‌నం ప్ర‌తిరోజూ ఉప్పును (Salt) తీసుకుంటాం. మ‌నం తినే ఆహారంలో ఉప్పు కొద్దిగ త‌క్కువ ఉన్నా రుచించ‌దు. నోటికి రుచిని తెలపడమే కాకుండా ఉప్పు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఉప్పు తీసుకోవడం వల్ల మెదడు యాక్టీవ్‌గా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి అయోడిన్‌ చాలా అవసరం. అయితే ఏదైనా తక్కువ మోతాదులో తీసుకుంటేనే మంచింది. ఎక్కువగా తీసుకుంటే మాత్రం అనర్థమే.

ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అధికం కావడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నదని హెచ్చరించింది. రోజుకు ఒక టీ స్పూన్‌ కంటే ఎక్కువ ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలిపింది. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే ఏటా ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడవచ్చని తెలిపింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్దల్లో సగటు ఉప్పు వాడకం 10.78 గ్రాములుగా ఉందని.. ఇది తాము సూచించిన 5 గ్రాముల పరిమితి కంటే ఎక్కువని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. ఎక్కువ ఉప్పు కలిగిన ఆహార పదార్థాలు తినడం వల్ల అన్నాశయ క్యాన్సర్‌, ఊబకాయం, ఆస్టియోపోరోసిస్‌, మెనియర్స్‌, మూత్ర పిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపింది. అధిక ఉప్పు వాడకం వల్ల ఏటా 18.9 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్‌కు ప్రతిగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరించింది. ఇలా ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా రకాల నష్టాలు కలుగుతాయి. మరి ఉప్పును ఎక్కువగా తీసుకుంటే కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బీపీ పెరుగుతుంది..

ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్త పోటు అనేది బాగా పెరుగుతుంది. రక్త పోటునే హైపర్ టెన్షన్ అని కూడి కూడా పిలుస్తారు. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. రక్త పోటు ఎక్కువగా పెరిగితే కిడ్నీలపై కూడా ప్రభావం పడుతుంది. ఉప్పు అధికంగా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఒక్కో పరిస్థితిలో కిడ్నీలు ఫెయిల్‌ అయి మరణించే అవకాశాలు ఉన్నాయి.

జీర్ణ సంబంధిత సమస్యలు..

ఉప్పును ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ ఆహారంలో ఉప్పును ఎక్కువగా తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దీని వల్ల అజీర్తి, అసిడిటీ సమస్యలు వస్తాయి.

గ్లూకోజ్ లెవల్స్..

షుగర్ ఉన్నవాళ్లు కూడా ఉప్పును చాలా తక్కువగా తీసుకుంటూ ఉండాలి. డయాబెటీస్ ఉన్నవాళ్లు ఉప్పు పట్ల సరైన శ్రద్ధ తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే.. శరీరంలో ఇన్సులిన్ లెవల్స్, గ్లూకోజ్ లెవల్స్ అనేవి దెబ్బతింటాయని నిపుణులు అంటున్నారు. దీంతో టైప్ – 2 డయాబెటీస్ రావచ్చు.

గుండె సమస్యలు..

ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి. బీపీ మాత్రమే కాకుండా ఉప్పు తీసుకుంటే రక్త నాళాలపై కూడా ప్రభావం పడుతుంది. గుండె సరిగ్గా ఆక్సిజన్ సరఫరా అందక.. హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి వాటికి గురవుతూ ఉంటారు.

 

 

 

RELATED ARTICLES

తాజా వార్తలు