Saturday, January 4, 2025
HomeTelanganaWhite Tiger | పాడైన మూత్ర‌పిండాలు.. నెహ్రూ జూ పార్క్‌లో తెల్లపులి మృతి

White Tiger | పాడైన మూత్ర‌పిండాలు.. నెహ్రూ జూ పార్క్‌లో తెల్లపులి మృతి

హైద‌రాబాద్‌: హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఉన్న‌ అరుదైన రాయల్‌ బెంగాల్‌ జాతికి చెందిన మగ తెల్లపులి (White Tiger) మ‌ర‌ణించింది. తొమ్మిదేండ్ల వ‌య‌స్సున్న ఈ తెల్లపులి పేరు అభిమన్యు. దీనికి గతేడాది ఏప్రిల్‌లో ‘నెఫ్రిటీస్‌’ కిడ్నీ సంబంధమైన జబ్బు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న అభిమన్యుకు జూ వెటర్నరీ విభాగం అధికారులు అన్ని రకాల వైద్యసేవలు అందించడంతో పాటు వీబీఆర్‌ఐ, వెటర్నరీ అధికారుల సూచనలు తీసుకున్నారు. అయితే ఈ నెల 12న అభిమన్యు ఆహారం తీసుకోలేదు. రెండు కిడ్నీలు పాడైపోవడంతో మంగళవారం మృత్యువాత పడింది. పోస్టుమార్టం నివేదికలో మూత్రపిండాలు పాడైపోయినట్లు తేలిందని జూ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం జూలో మొత్తం 18 పులులు ఉన్నాయి. అందులో తెల్లపులుల సంఖ్య 8.

హాట్ స‌మ్మ‌ర్‌లో కూల్‌కూల్‌గా..

ఈ వేస‌విలో ఉష్ణోగ్ర‌త‌లు రికార్డు స్థాయికి చేరాయి. దీంతో మూగ‌జీవాల‌కు చల్లదనాన్ని అందించేందుకు జంతు ప్రదర్శన శాల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్ప్రింక్లర్లు, కూలర్లలతో జంతువులకు చల్లదనాన్ని పంచుతున్నారు. జంతువులు ఉండే షెడ్డులపై గడ్డి, వెదురు, చాపలు, వట్టివేలు ఏర్పాటు చేసి వాటిపై నీళ్లు చల్లుతున్నారు. అదేవిధంగా వన్య ప్రాణులకిచ్చే ఆహారంలో మార్పులు చేశారు. జంతువులకు నిరంతరం చల్లటి నీళ్లతో స్నానాలు చేయిస్తున్నారు. పక్షులు ఉండే ప్రాంతాల్లో చల్లగా ఉండేందుకు డ్రిప్​ సహాయంతో వాటిపై నీటి తుంపర్లు పడే విధంగా ఏర్పాటు చేశారు. చలువ పందిళ్లు వేసి జంతువులు, పక్షులు సేద తీరేలా ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు వేడి వాతావరణాన్ని చల్లబరుస్తూ వన్యప్రాణులకు భానుడి తాపం నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు. జంతువులకు వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు