Sudha Reddy | న్యూయార్క్ వేదికగా 2024 మెట్ గాలా ఈవెంట్ అతివల అందాలతో మెరిసిపోయింది. ఈ ఈవెంట్ ఎంటర్‌టైన్‌మెంట్, బిజినెస్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలతో నిండిపోయింది. ఒకరిని మించి ఒకరు ముస్తాబై ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ఆ సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వైరలవుతున్న వారిలో బిజినెస్ ఉమెన్ సుధారెడ్డి ( Sudha Reddy ) కూడా ఒకరు. ఐవరీ సిల్క్ గౌన్ ధరించిన ఆమె.. అందరి కళ్లు చెదిరేలా డైమండ్ నెక్లెస్ ధరించి ఈవెంట్‌కు హాజరైంది. దీంతో సుధా రెడ్డి టాక్ ఆఫ్ న్యూయార్క్‌గా మారింది. మరి ఆ సుధారెడ్డి ఎవరో కాదు.. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ మేఘా కృష్ణా రెడ్డి భార్య. అంతే కాకుండా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL)కు డైరెక్టర్ కూడా.
ఫ్యామిలీకి గుర్తుగా ‘అమోర్ ఎటెర్నో’
మెట్ గాలా ఈవెంట్‌లో మెరిసిన సుధా రెడ్డి తన ఫ్యామిలీకి గుర్తుగా అమోర్ ఎటెర్నో అనే జ్యువలరీ బ్రాండ్‌కు చెందిన డైమండ్ నెక్లెస్‌ను ధరించారు. ఈ డైమండ్ నెక్లెస్ 180 క్యారెట్ డైమండ్ నెక్లెస్ అని సమాచారం. దీనికి ఉన్న లాకెట్ 25 క్యారెట్లు ఉంటుందట. ఇది హృదయాకారంలో ఉన్న లాకెట్. మరో మూడు 20 క్యారెట్ల హార్ట్ షేప్ డైమండ్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ హార్ట్ షేప్ డైమండ్స్‌కు ఒక ప్రత్యేకత ఉందట. ఈ మూడు హార్ట్ షేప్ డైమండ్స్‌ను తన భర్త మేఘా కృష్ణా రెడ్డి, ఇద్దరు పిల్లలు మానస్, ప్రణవ్‌కు ప్రతీకగా ధరించారట. నెక్లెస్ మాత్రమే కాదు సుధా రెడ్డి చేతికి పెట్టుకున్న రెండు రింగ్స్ కూడా డైమండ్సే అని తెలుస్తోంది. అందులో ఒకటి 23 క్యారెట్ డైమండ్ రింగ్ కాగా మరొకటి 20 క్యారెట్ డైమండ్ రింగ్ అని సమాచారం.
ఆ రింగ్స్ విలువ రూ. 165 కోట్లు..
సుధా రెడ్డి ధరించిన రింగ్స్ ధర దాదాపు 20 మిలియన్ ఉంటుందని తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో ఏకంగా రూ.165 కోట్లు. తను ధరించిన ఐవరీ సిల్క్ గౌన్‌ను తయారు చేయడానికి 80 మండి డిజైనర్లు.. 4,500 గంటలు కష్టపడ్డారట. దీనిపై పర్ల్ ఫ్లవర్స్‌తో పాటు 3డీ బటర్ ఫ్లై డిజైన్స్ కూడా జతచేర్చారు. ఈ గౌన్‌ను ఫరా అలీ ఖాన్ డిజైన్ చేశారని కూడా సుధా రెడ్డి బయటపెట్టారు. 19 ఏళ్లకే కృష్ణా రెడ్డిని పెళ్లి చేసుకున్నారు సుధా. తన సొంతూరు విజయవాడ అయినా కూడా కృష్ణా రెడ్డిని పెళ్లి చేసుకోవడంతో హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. తన బిజినెస్ స్కిల్స్ చూసి అందరూ తనను ‘క్వీన్ బీ ఆఫ్ హైదరాబాద్’ అని అంటుంటారు.
View this post on Instagram