లక్నో: వారిద్దరు ప్రేమ పెండ్లి చేసుకున్నారు. వేరు కాపురం పెట్టారు. తల్లి దండ్రులతో కలిసి ఉందామని అన్నందుకు సైకోలా మారిన ఆమె (Tortured Wife) భర్తకు నరకమంటే ఏంటో చూపించింది. చీరలతో అతని చేతులు పైకి కట్టేసి.. అతని బట్టలన్నీ విప్పేసి.. అంగాన్ని చాకుతో కోసేస్తాని బెదిరించింది. సిగరెట్‌తో ఒళ్లంతా కాల్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బిజ్నోర్‌లో చోటుచేసుకుంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
బిజ్నోర్ జిల్లాకు చెందిన మన్నన్ జైదీ, మెహెర్ జహాన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. మెహెర్‌కి సిగరెట్, మందు అలవాటు ఉండడంతో బలవంతంగా వేరు కాపురం పెట్టించింది. అయితే చెడు అలవాట్లు మానుకోలని భర్త మన్నన్ ఆమెను తరచూ కోరుతున్నాడు. ఆమె మారకపోవడంతో తన తల్లిదండ్రులతో కలిసి ఉందాని చెప్పాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మెహర్.. గత నెల 29న అతడిని చిత్రహింసలు పెట్టింది. అన్నంలో మత్తుమందు కలిపిన అన్నం తినడంతో అపస్మారక స్థిలోకి వెళ్లిన అతడిని.. చీరలతో రెండు చేతులను పైకి కట్టేసింది. బట్టలు విప్పేసి చాకుతో అతని అంగాన్ని కోసేస్తా అని బెదిరించింది. మన్నన్ ఎంత బతిమాలినా పట్టించుకోని మెహర్.. అతడు కేకలు పెడుతుండటంతో చున్నీని నోటిలో కుక్కింది. అనంతరం సిగరెట్ వెలిగించి అతని మొహంపై ఊదింది. అంతటితో ఆగకుండా ఒంటిపై కాల్చింది.
అయితే తన భార్య వేధిస్తున్నదని మన్నన్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో మన్నన్ ఇంట్లో సీసీటీవీ అమర్చాడంతో సైకో భార్య లీలు రికార్డయ్యాయి. ఎలాగోలా తప్పించుకున్న మన్నన్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీని వారికి చూపించడంతో ఖంగుతిన్నారు.
భర్తను చిత్రహింసలు పెట్టిన భార్య.. వీడియో చూసి షాక్ అయిన పోలీసులు.
ఉత్తరప్రదేశ్ – బిజ్నోర్ జిల్లాలో మన్నన్, మెహెర్ ప్రేమ వివాహం చేసుకున్నారు.. మెహెర్‌కి సిగరెట్, మందు అలవాటు ఉండడంతో బలవంతం పెట్టి సెపరేట్‌గా కాపురం పెట్టించింది.
భర్త మన్నన్ చెడు అలవాట్లు మానుకోమని, తన… pic.twitter.com/DavaXFEz0T
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2024