Saturday, January 4, 2025
HomeSportsICC Champions Trophy | ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం పాక్‌కు టీమిండియా వెళ్తుందా? రాజీవ్‌ శుక్లా...

ICC Champions Trophy | ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం పాక్‌కు టీమిండియా వెళ్తుందా? రాజీవ్‌ శుక్లా స్పందన ఇదే..!

ICC Champions Trophy | వచ్చే ఏడాది పాక్‌ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ జరుగనున్నది. అయితే, ఈ టోర్నీలో భారత్‌ పాల్గొంటుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే భారత జట్టు పాక్‌కు వెళ్తుందని.. ఇదొక్కటే తమ ఉందున్న కండీషన్‌ అని ఆయన స్పష్టం చేశారు. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తామన్న ఆయన.. అనుమతి ఇస్తే టీమిండియాను పాక్‌కు పంపుతామన్నారు.

కేంద్రం నిర్ణయం ప్రకారమే తాము నడుచుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా.. 2025లో ఫిబ్రవరి -మార్చి మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. పాక్‌ వేదికగా జరుగుతుండడంతో టీమిండియా పాక్‌కు వెళ్లకపోవచ్చని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రాజీవ్‌ శుక్లా స్పష్టతనిచ్చారు. టీమిండియా చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించింది. ఆసియా కప్‌లో ఆడగా.. ఆ తర్వాత మళ్లీ పాక్‌లో అడుగుపెట్టలేదు. ఉగ్రదాడుల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

పాక్‌ జట్టు చివరగా 2012 డిసెంబర్‌- 2013 జనవరి మధ్యలో భారత్‌లో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో జరుగుడం లేదు. ఐసీసీ నిర్వహించే టోర్నీల్లోనే తలపడుతున్నాయి. అలాగే, ఆసియా కప్‌లో ఇరుజట్లు పోటీపడ్డాయి. గతేడాది ఆసియా కప్‌కు పాక్‌ ఆతిథ్యం ఇచ్చినా.. భారత్‌ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించింది. దాంతో హైబ్రిడ్‌ మోడల్‌లో భారత్‌తో జరిగే మ్యాచులను శ్రీలంకలో నిర్వహించాల్సి వచ్చింది. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్-2023లో పాక్‌ పాల్గొన్నది.

RELATED ARTICLES

తాజా వార్తలు