Friday, April 4, 2025
HomeTelanganaWine Shops | మ‌ద్యం ప్రియుల‌కు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు వైన్సులు బంద్‌

Wine Shops | మ‌ద్యం ప్రియుల‌కు బ్యాడ్ న్యూస్.. రెండు రోజులు వైన్సులు బంద్‌

హైద‌రాబాద్‌: మ‌రో రెండు రోజుల్లో ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగ‌నుంది. రెండు నెల‌లుగా కొన‌సాగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర‌ప‌డ‌నుంది. శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు ప్ర‌చార ప‌ర్వానికి ఫుల్‌స్టాప్ ప‌డుతుంది. అదేవిధంగా మ‌ద్యం షాపులు (Wine Shops) కూడా మూత‌ప‌డ‌నున్నాయి. శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల నుంచి సోమ‌వారం (మే 13) సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు వైన్స్‌లు బందవ‌నున్నాయి.

మరోవైపు, ఎండలు మండిపోతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. మరీ ముఖ్యంగా బీర్లు ఒక రేంజ్‌లో అమ్ముడుపోతున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం చాలామంది చల్లని బీరు కోసం వైన్‌షాపుల ముందు క్యూ కడుతున్నారు. బీర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో ఆ మేరకు సరఫరా చేయలేక దుకాణదారులు చేతులెత్తేస్తున్నారు.

సాధారణంగా ప్రధాన బ్రాండ్ల బీర్లను ఒక్కో షాపునకు 20 నుంచి 25 కేసులు కేటాయిస్తారు. ఇవి నిమిషాల వ్యవధిలోనే ఖాళీ అయిపోతున్నట్టు దుకాణదారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు దాదాపు 80 వేల కేసులకు పైగా బీర్లు అమ్ముడుపోతుండగా, ఇప్పుడు అదనంగా మరో 20 వేల కేసుల బీర్లకు డిమాండ్ ఉన్నట్టు వ్యాపారులు తెలిపారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు