Wines | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.
మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు వైన్ షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈసీ నిబంధనలు ఉల్లంఘించిన మద్యం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.